అశోక్‌గజపతిరాజుకి చేదు అనుభవం, రోడ్‌పై బైఠాయింపు

Ashok Gajapathi Raju
విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు పైడితల్లి ఆలయం వద్ద అవమానం జరిగింది. మంగళవారం ఉదయం ఆయన తన అనుచరులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లగా అనుచరులను, ఆయనను ఆలయ అధికారులు అడ్డుకున్నారు.

దీంతో ఆగ్రహించిన అశోక్ గజపతి రాజు ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపారు. దీంతో ఆలయ అధికారులు ఆయనను శాంతింపజేసి ఆయనను, అనుచరులను ఆలయంలోకి అనుమతించడంతో పరిస్థితి సర్దుమణిగింది.

మరోవైపు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

ఉత్తరాంధ్రలో పైడితల్లి ఉత్సవం ప్రతి ఏటా ఘనంగా జరుగుతుంది. ఈ పైడితల్లి ఉత్సవాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు, ప్రజలు తరలి వస్తారు. ఈ ప్రాంతవాసులు తమ బిడ్డలకు, కొడుకులకు అమ్మవారి పేరు మీదుగా పైడితల్లి అని పేర్లు పెట్టుకుంటారు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా పైడితల్లి అని పేరు పెడుతుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+