హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శివాజీకి అవమానం, ఎంపీ బుజ్జగింపు: టీడీపీ ఆదాయ, వ్యయాలు ఇవే

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసన సభ్యుడు గౌతు శివాజీకి బుధవారం నాడు మహానాడు ప్రాంగణం వద్ద అవమానం జరిగింది. ఆయనను లోపలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

ఆయన పోలీసులు పన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేనని, మాజీ మంత్రిని అని చెప్పారు. అలాంటి తనను పోలీసులు ఆపి అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తూ గేటు వద్ద నిరసన తెలిపారు. పోలీసులకు, అతనికి వాగ్వాదం జరిగింది.

ఈ విషయం తెలుసుకున్న చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి సర్ది చెప్పారు. పోలీసులకు చెప్పి, ఎమ్మెల్యేను బుజ్జగించి అతను లోపలకు తీసుకు వెళ్లారు.

కాగా, మహానాడు వేదికపై చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేసిన విషయం తెలిసిందే. గండిపేటలో ఏర్పాటు చేసిన మహానాడులో ఆయన మాట్లాడుతూ టీడీపీ చేసిన అభివృద్ధితోనే తెలంగాణలో మిగులు బడ్జెట్‌ ఉందన్నారు. విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం కలిగిందని బాబు తెలిపారు.

2022 నాటికి దేశంలోనే టాప్‌-3 స్థానంలో ఏపీ ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో విపరీతమైన సహజవనరులు ఉన్నాయన్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

పారాశ్రామికాభివృద్ధికి సముద్ర తీరాన్ని వినియోగించనున్నట్లు చెప్పారు. భూగర్భ జలాలు పెరగాలంటే నీరు-చెట్టు కార్యక్రమం అవసరమని అభిప్రాయపడ్డారు. బిందుసేద్యం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యతనిస్తామన్నారు.
ఏడాదిలోగా ప్రతి ఇంటికి ఫైబర్‌ కనెక్టివిటీని కల్పించనున్నట్లు తెలిపారు.

తెలంగాణను టీడీపీనే అభివృద్ధి చేసిందని, దానిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు. 1995 నాటి పరిస్థితి, ఇప్పటి పరిస్థితిపై చర్చిద్ధామన్నారు. తెలంగాణలో సమస్య ఉన్నచోట మన నాయకులున్నారని, ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు.

Bitter experience to Gouthu Shivaji

టీడీపీ ఆదాయ, వ్యయాలు

2015 మార్చి 31 నాటికి టీడీపీ ఆదాయం - రూ.78.51 కోట్లు
వడ్డీ రూపంలో ఆదాయం - రూ.2.47 కోట్లు
మొత్తం ఆదాయం - రూ.88.60 కోట్లు
ప్రచార ఖర్చు - రూ.11 కోట్లు
అద్దెలకు - రూ.1.28 కోట్లు
కార్యాలయం ఖర్చుల - రూ.21 కోట్లు
నికర నిధులు - రూ.43 కోట్లకు పైగా
నికర ఆస్తులు - రూ.50 కోట్లకు పైగా

English summary
Bitter experience to Gouthu Shivaji at Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X