పరిపూర్ణానందకి చేదు: జగన్ దిగ్భ్రాంతి, రూ.1650 కోట్లు ఏం చేశారని అంబటి
రాజమండ్రి: శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామికి రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద చేదు అనుభవం ఎదురయింది. పుష్కర ఘాట్‌లోకి పరిపూర్ణానంద స్వామిని పోలీసులు అనుమతించలేదు. ఐదు గేట్లలోను పరిపూర్ణానంద ప్రవేశానికి నిరాకరించారు. దీంతో పరిపూర్ణానంద వెనుదిరిగారు.
రాజమండ్రిలో విషాదంపై కామినేని
గోదావరి పుష్కరాల్లో 17 మంది వరకు మృతి చెందారు. మృతి చెందిన వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గాయపడ్డ వారికి రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వారిని మంత్రి కామినేని శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇది దురదృష్టకరమన్నారు. ఒకే ఘాట్‌కు ఎక్కువ మంది రావడం వల్లే ఈ సంఘటన జరిగిందన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రితో మాట్లాడి మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరణించిన వారిలో పశ్చిమ గోదావరి జిల్లా యండగండికి చెందిన రుద్రరాజు లక్ష్మి(65)గా గుర్తించారు. మిగతా వారిని గుర్తించవలసి ఉంది. కాగా, తోపులాట సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులు హాహాకారాలుచేశారు. దాదాపు అరగంటపాటు భయానక పరిస్థితి కనిపించింది. పుష్కర ఘాట్ల వద్ద అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంపై అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పుష్కరాల ఏర్పాట్లపై అంబటి ఆగ్రహం, జగన్ దిగ్భ్రాంతి
పుష్కరాల ఏర్పాట్ల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు మంగళవారం మండిపడ్డారు. రూ.1650 కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. పుష్కర ఘటన పైన వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications