కడపలో వైఎస్ షర్మిలకు షాక్-జగన్ అన్నీ చేశాడని ఫ్యాన్ వాగ్వాదం-కౌంటర్..!

ఏపీలోని సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలకు చేదు అనుభవం ఎదురైంది. మైదుకూరు నియోజకవర్గంలో ఆమె ప్రసంగిస్తుండగా.. ఓ జగన్ అభిమాని ఆమెను అడ్డుకున్నాడు. జగన్ తమకు అన్నీ ఇచ్చాడంటూ ఆమెకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె స్వయంగా అతన్ని ఆహ్వానించి ఏమిచ్చాడో చెప్పమంటూ మైక్ ఇచ్చారు. అనంతరం అతను వైఎస్ జగన్ పాదయాత్ర చేయడంతో పాటు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాడని చెప్పుకొచ్చాడు.

మైదుకూరు నియోజక వర్గంలో వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగుతుండగా.. దువ్వూరు మండల కేంద్రంలో వైఎస్ షర్మిలా మాట్లాడుతుండగా జై జగన్ అంటూ ఓ కార్యకర్త నినాదాలు చేసాడు. దీంతో జగన్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సవాల్ వైఎస్ షర్మిలా రెడ్డి అతనికి సవాల్ విసిరారు. అనంతరం సదరు కార్యకర్త ను పిలిచి మాట్లాడించారు. జగన్ తమకు అన్నీ చేశాడంటూ అతను చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత షర్మిల మాట్లాడుతూ అతనికి సూటి ప్రశ్నలు వేశారు. జగన్ చేసిన అభివృద్ధి ఏమి లేదంటూ షర్మిలకు కాంగ్రెస్ అభిమానులు నినాదాలు చేశారు.

bitter experience to pcc chief ys sharmila in home land kadapa from ys jagan fan

ఒకప్పుడు తాను కూడా జై జగన్ ఆన్న వ్యక్తినే అని షర్మిల గుర్తుచేశారు. వైఎస్సార్ ఆశయాలు నిలబెడతారు అనుకున్నానని,రాష్ట్ర అభివృద్ధి పై మాట తప్పుతాడు అనుకొలేదని చెప్పారు. మద్యనిషేధం అన్నాడు అమలయ్యిందా ? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధిస్తాం అన్నాడు ..పోరాటం చేశాడా ? అని అడిగారు. పోలవరం కడతాం అన్నాడు... కట్టాడా? అని అడిగారు. ⁠రాష్ట్రానికి కనీసం రాజధాని ఉందా ? అని నిలదీశారు.

మాట ఇస్తే మాట మీద నిలబడటం వైఎస్సార్ లక్షణమని,మరి ⁠మాట తప్పిన జగన్ ను ఏమనాలి ? అని ప్రశ్నించారు. జగన్ మాట మీద నిలబడ్డాడా? అని అడిగారు. జగన్ జైల్లో ఉంటే 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది నేను అని అతనికి గుర్తుచేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+