ఒక్క ఏపీ కోసం తెలంగాణ సహా ఎఫెక్ట్: మోడీకి ఒడిశా ఎమ్మెల్యేల షాక్
భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును కడితే ఊరుకునేది లేదని బిజూ జనతా దళ్ (బిజెడి) ఎమ్మెల్యేలు మరోసారి హెచ్చరించారు. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తే దానిని తాము వ్యతిరేకిస్తామని బిజెడి ఎమ్మెల్యేలు మంగళవారం స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టునపై ఒడిశా అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేడీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ప్రాజెక్టుతో ఒడిశాకు తీవ్ర నష్టం జరగనుందన్నారు. కేంద్రం సహకరిస్తే మాత్రం తాము అసెంబ్లీలో అభిశంసన తీర్మానం చేస్తామన్నారు. పోలవరంతో ఒడిశా ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు.
సీనియర్ బిజెడి ఎమ్మెల్యే, మాజీ మంత్రిఅమర్ ప్రసాద్ సత్‌పతి పోలవరం అంశాన్ని సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల వ్యవసాయ భూమి పోతుందని, అలాగే మల్కాన్‌గిరి జిల్లాలో గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. పోలవరం పైన యూపీఏ ప్రభుత్వం విధానంలోనే ఎన్డీయే ప్రభుత్వం వెళ్తోందన్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల వాదనలు కేంద్రం వినాలన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కాశీపూర్, గునుపూర్ ప్రాంతాలు పూర్తిగా నీట మునుగుతాయన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రభావం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల పైన ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కేవలం ఒక్క ఏపీ ప్రయోజనం కోసమే అన్నారు.
పోలవరం ప్రాజెక్టు విషయమై అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సభాపతిని బిజెడి ఎమ్మెల్యే కోరారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఒడిశాలోని రెండువేల హెక్టార్ల పైన ప్రభావం ఉంటుందన్నారు. బిజెడి సభ్యులు రంజన్ దాష్, రణేంద్ర ప్రతాప్ స్వాన్, డంబారు సిసాలు ఎమ్మెల్యే సత్‌పతి ప్రతిపాదనను సమర్థించారు.
కాంగ్రెస్ పార్టీ సభ్యులు తాప్రసాద్ బహినిపాటి బిజెడి ఎమ్మెల్యేల డిమాండుకు మద్దతు పలికారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ సభ్యులు రబి నారాయణ్ నాయక్ మాత్రం.. ఇప్పటి వరకు ప్రభుత్వం నష్టం పైన అంచనా వేయలేకపోయిందన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications