ఏపీలో దాదాగిరి.. ఢిల్లీలో చెంచాగిరీ.. జగన్‌పై ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్‌పై బీజీపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జగన్‌కు సూపర్ చెక్ పడనుందన్నారు. ఆయన కేసులన్ని బయటకు వస్తాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంతో బీజేపీకి ఎలాంటి మిత్రుత్వం లేదని స్పష్టం చేశారు. జగన్ సర్కార్‌తో ఢీ కొట్టేందుకు సిద్ధమన్నారు.

ఢిల్లీలో చెంచాగిరీ.. ఏపీలో దాదాగిరి..
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ ఆగడాలు పెచ్చుమీరిపోయాయని దుయ్యబట్టారు ఆదినారాయణ రెడ్డి. తన 31 నెలల పాలనలో రాష్ట్రాన్ని నాశం చేశారని మండిపడ్డారు. జగన్ కేసులన్ని బయటకు వస్తాయని.. ఆయనకు సూపర్ చెక్ పడుతుందని హాట్ కామెంట్స్ చేశారు. ప్రాంతీయ పార్టీలు ఆడే మైండ్ గేమ్ పాలిటిక్స్ ఏంటో బీజేపీకి అర్థం చేసుకోని పరిస్థితుల్లో లేదన్నారు. సీఎం జగన్ ఏపీలో దాదాగిరి.. ఢిల్లీలో చెంచాగిరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ వద్ద నేల మాళిగలు..
మఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆశ తీరలేదన్నారు. ప్రధాని కావాల్సిన వ్యక్తి జగన్ అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు . వారి ఆశలకు హద్దులు లేకుండా పోతున్నాయని ఎద్దేవా చేశారు. పద్మనాభ స్వామి ఆలయంలో నేల మూళిగలున్నట్లు.. జగన్ వద్ద అనేక నేల మాళిగలు దాగి ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటికి వచ్చినట్లు అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

ప్రత్యేక హోదా బిర్యానీ లాంటిది.. ప్రత్యేక ప్యాకేజీ బఫే వంటిది..
ఏపీకి ప్రత్యక హోదా బిర్యానీ లాంటిది.. ప్రత్యేక ప్యాకేజీ బఫే వంటిదని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. బఫేలో అన్ని రకాలు ఐటమ్స్ ఉంటాయి. ఎస్పీవీ పెట్టి ప్యాకేజీ ద్వారా నిధులు తెచ్చుకోమని కేంద్రం చెబితే దాన్ని తప్పుపడుతున్నారని మండిపడ్డారు. వైసీపీది చేతకాని ప్రభుత్వమని.. ఫ్యాకేజీని వాడుకుంటే ఎంతైనా నిధులు వస్తాయన్నారు. కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ .. ఢిల్లీ వచ్చి ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఏపీ సర్కార్‌పై పోరాటమే..
విశాఖ స్టీల్ ప్లాంటుపై కేంద్ర ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించే బీజేపీ ప్రజాగ్రహసభ వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి తొలి మెట్టు అని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. మంత్రి కొడాలి నాని బీజేపీపై విమర్శలు చేస్తున్నారు.. వైసీపీ నేతలు ఢిల్లీలో సాగిలపడుతున్నారని ఆరోపించారు. ఆపార్టీలా ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో ఓ మాట మాట్లాడే అలవాటు బీజేపీకి లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడేది బీజేపీయే అన్నారు.












Click it and Unblock the Notifications