ప్రజల్లోకి టీడీపీ 'తొలి అడుగు', దూరంగా జనసేన.. బీజేపీ - మారుతున్న లెక్కలు..!!
ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయిన వేళ చంద్రబాబు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాది పాలన పైన ప్రజల్లోకి వెళ్లి వివరించేందుకు ఈ రోజు నుంచి తొలి అడుగు పేరుతో పర్యటనలు ప్రారంభించారు. అయితే, ప్రభుత్వ విజయాల పై చేస్తున్న కార్యక్రమానికి బీజేపీ, జనసేన దూరంగా ఉన్నాయి. చంద్రబాబు కుప్పం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తుంటే.. పవన్ పాల్గొనటం లేదు. ఎందుకు.. అసలు ఏం జరుగుతోంది...
తొలి అడుగు వేళ
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఏడాది కాలంలో ప్రభుత్వం ఎంతో సాధించిందని కూటమి నేతలు చెబుతున్నారు. చేసింది ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందు కోసం తొలి అడుగు పేరుతో పార్టీ నేతలంతా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ డిసైడ్ చేసారు. ఈ రోజు మొదలు పెట్టారు. తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, ఈ కార్యక్రమం టీడీపీ సోలోగా నిర్వహిస్తు న్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం లో భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీ ఈ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనటం లేదనేది ఆసక్తి కరంగా మారుతోంది. రెండు రోజుల క్రితం టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి.. కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు.

దూరం వెనుక
ప్రభుత్వం సాధించిన విజయాలు మూడు పార్టీలతో ఏర్పడిన కూటమికి దక్కుతుందనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో టీడీపీ నేతలు మాత్రమే తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్లటం ఏంటనే ది ఆసక్తి కరంగా మారుతోంది. కూటమిలోని మొత్తం 164 ఎమ్మెల్యేలతో నిర్వహించాల్సిన తొలి అడుగు సన్నాహక సమావేశం టీడీపీతో మాత్రమే జరిగింది. ఈ కార్యక్రమంలో నేరుగా చంద్రబాబు పాల్గొంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ మాత్రం దూరంగా ఉన్నారు. బీజేపీ సైతం తొలి అడుగు కు దూరంగా ఉంది. జనసేన, బీజేపీ ఇందులో భాగస్వామ్యం ఎందుకు తీసుకోవటం లేదనేది అంతు చిక్కని అంశంగా మారుతోంది. అటు వైసీపీ ఏడాది పాలనలో హామీల విస్మరణ.. వైఫల్యాల పైన ప్రజల్లోకి వెళ్తోంది. ఈ సమయంలో కూటమిలో పరిణామాలు కీలకంగా మారుతున్నాయి.
ఏం జరుగుతోంది
ప్రభుత్వం లో తీసుకున్న నిర్ణయాల గురించి ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో.. దీనిని మూడు పార్టీ లు సంయుక్తంగా నిర్వహించక పోవటం కొత్త చర్చకు కారణమవుతోంది. టీడీపీ నేతలు మాత్రమే ప్రజల్లోకి వెళ్లటం ఏంటనే చర్చ జరుగుతోంది. దీంతో.. కూటమి పార్టీల మధ్య ఏం జరుగుతుందనే అంశం పైన విశ్లేషణలు మొదలయ్యాయి. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సమిష్టిగా మూడు పార్టీలు నిర్వహిస్తే.. కలిసి కట్టుగా ప్రజల్లోకి వెళ్లటంతో సానుకూల సంకేతాలు వెళ్తాయని.. ఇప్పుడు వేర్వేరుగా ఉండటం ద్వారా కొత్త సందేహాలకు అవకాశం ఇచ్చినట్లవుతుందనే విశ్లేషణ లు మొదలయ్యాయి. ఈ కార్యక్రమం లో బీజేపీ, జనసేన పార్టీలు దూరంగా ఉండటం పైన కూటమి నేతలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.












Click it and Unblock the Notifications