టీడీపీ అధినేత చంద్రబాబుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో పొత్తు రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీ అధినతే చంద్రబాబు - పవన్ కళ్యాణ్ సమావేశం తరువాత పొత్తుల అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. కానీ, బీజేపీ విషయంలోనే అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఆ ఇద్దరు నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఇతర పార్టీల నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.
ఇదే సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీరు పైన కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఆ తరువాత పార్టీ ముఖ్య నేతల జోక్యంతో వివాదం తగ్గుముఖం పట్టినా..పూర్తిగా మాత్రం పరిష్కారం కాలేదు. బీజేపీ నేతలు జనసేనతో తమతోనే ఉందని చెబుతూ, టీడీపీతో పొత్తు లేదని స్పష్టం చేస్తున్నారు. తాజాగా సోము వీర్రాజు మరోసారి టీడీపీ అధినేనత చంద్రబాబు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటించిన సమయంలో టీడీపీ -జనసేన జెండాలు కనిపించాయి. దీని పైన స్పందించిన వీర్రాజు అవి చంద్రబాబు ఏర్పాటు చేసిన జెండాలుగా పేర్కొన్నారు. జనసేన బీజేపీతోనే ఉందని చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని మరోసారి తేల్చి చెప్పారు. జనసేన కాకుండా ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని చెప్పుకొచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యల పైన స్పందించేందుకు వీర్రాజు నిరాకరించారు. ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ రాసారు. భద్రాద్రిలో రాముల వారి ఆస్తులను కాపాడలంటూ భద్రాద్రి రాముడి భూమలను కొందరు కబ్జాకు ప్రయత్నిస్తున్నారని వీర్రాజు ఆరోపించారు. వందల కోట్ల ఆస్తిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ముఠా, ఎండోమెంట్ అధికారుల పైన దౌర్జన్యానికి ప్రయత్నించారని వివరించారు. వెంటనే దీని పైన జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రిని సోము వీర్రాజు డిమాండ్ చేసారు.