శకునిలా జగన్ అడ్డుపడుతున్నాడు: మంత్రి పల్లె, 'ఏపీలో 25 జిల్లాలను ఏర్పాటు చేయాలి'
విశాఖపట్నం: లోక్‌సభ నియోజకవర్గాల ఆధారంగా ఏపీలో వెంటనే 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏపీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. సెప్టెంబరులో జరిగే శాసనసభ సమావేశాల్లో నిత్యావసర వస్తువులు, ఇసుక విధానంపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. పట్టిసీమను త్వరితగతిన పూర్తి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా పోలవరం నిర్మాణ పనులు కూడా త్వరగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోందని అన్నారు. ఏడాది కాలంలో ఏపీకి దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనంత సాయాన్ని అందించారని తెలిపారు. బీజేపీ ప్రతినిధుల బృందం ఈనెల 12న పోలవరం ప్రాజెక్ట్, 13న విజయనగరం జిల్లా తోటపల్లి ప్రాజెక్టు, 14, 15న రాయలసీమలోని ప్రాజెక్టులను పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఏపీ అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారు: మంత్రి పల్లె
ఏపీ అభివృద్ధిని శకునిలా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని రాష్ట్ర సమాచారశాఖా మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్, వైసీపీ నేతలు అపోహలు సృష్టిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు.
ఎన్ని జన్మలెత్తినా జగన్ సీఎం కాలేడన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు. అదే విధంగా గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని శనివారం విజయవాడలో ఘనంగా నిర్వహిస్తామని, ఈ సందర్భంగా 14 మంది ప్రముఖులను సత్కరిస్తామన్నారు.












Click it and Unblock the Notifications