పవన్ కల్యాణ్ పై బీజేపీ కొత్త గేమ్ - టీడీపీ హ్యాపీ..!!

బీజేపీ - జనసేన పొత్తు విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి

ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ - జనసేన మధ్య పొత్తు ఉందా లేదా అనే దానికి క్లారిటీ వస్తోంది. అనుకున్న సమయం కంటే ముందుగానే దాదాపు ఖరారైన పొత్తున అధికారకంగా ప్రకటించేందుకు రంగం సిద్దం అవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. అందులో భాగంగా బీజేపీతో పొత్తులో కొనసాగుతున్న జనసేన అయిష్టం గానే ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో బీజేపీ జాతీయ నేతల సమక్షంలో పవన్ కల్యాణ్ లక్ష్యంగా కొత్త గేమ్ మొదలు పెట్టింది.

BJP Breakup with Janasena..? Madhav hints Saffron party future steps in AP Politics..

జనసేనతో కలిసున్నా లేనట్టే
ఏపీలో కొంత కాలంగా బీజేపీ - జనసేన కటీప్ ఖాయమనే ప్రచారం సాగుతోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు బరిలో నిలిచినా జనసేన మద్దతు ఇవ్వలేదు. తాము కోరినా పవన్ ప్రకటన చేయలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. జనసేన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని పిలుపు ఇచ్చినా.. బీజేపీకి వేయమని మాత్రం చెప్పకపోవటాన్ని కమలం పార్టీ నేతలు సీరయస్ గా తీసుకున్నారు. ఇక పవన్ తమతో ఉండే అవకాశం లేదని డిసైడ్ అయ్యారు. జనసేన ఆవిర్భావ సభలోనూ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపైన పార్టీలో చర్చ జరిగింది. బీజేపీ జాతీయ నేతలు రాష్ట్రంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఆ వెంటనే పవన్ ను ఉద్దేశించి పార్టీ నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు.

BJP Breakup with Janasena..? Madhav hints Saffron party future steps in AP Politics..

బీజేపీ - జనసేన కటీఫ్
జనసేనతో బంధం పైన బీజేపీ నేత మాధవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. జనసేనతో పేరుకే పొత్తు కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. తాము మద్దతు కోరినా జనసేన ముందుకు రాలేదన్నారు. విజయవాడలో పార్టీ ముఖ్య సమావేశం జరిగింది. తమతో ఉన్నా దూరం పాటిస్తున్న పవన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో పార్టీ ముఖ్య నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనలో భాగంగానే ఇప్పుడు పవన్ లక్ష్యంగా బీజేపీ నేతలు ఇప్పటి వరకు మౌనం పాటిస్తూ వచ్చినా..ఇక ఓపెన్ గా మాట్లాడటం ప్రారంభించారు. జనసేన తమతో పొత్తులో ఉంటూనే మరో పార్టీకి మేలు చేసేలా వ్యవహరిస్తోందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. బీజేపీ-జనసేన కలిసి ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు ఉంటుందని ప్రజలు నమ్ముతారని మాధవ్​ స్పష్టం చేశారు. దీనికి కొనసాగింపుగా ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని పరోక్షంగా తమ లక్ష్యం స్పష్టం చేసారు.

BJP Breakup with Janasena..? Madhav hints Saffron party future steps in AP Politics..

టీడీపీ తో పొత్తుకు లైన్ క్లియర్
ఇక బీజేపీ - జనసేన మధ్య బ్రేకప్ ఖాయంగా కనిపిస్తోంది. పవన్ సైతం అవే సంకేతాలు ఇస్తూ వచ్చారు. కానీ, బీజేపీ కేంద్రం నాయకత్వం కోసం వేచి చూసే ధోరణితో కనిపించారు. ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం ఓపెన్ గా తాము సొంతంగా ఎదగాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పటం..జనసేన తీరు పైన అసహనం వ్యక్తం చేయటంతో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖాయమైనా..అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పుడు బీజేపీ తాము జనసేనతో పొత్తులో ఉన్నా ఉపయోగం లేదనే విధంగా వ్యాఖ్యలు చేయటంతో..ఇప్పుడు పవన్ కు రూట్ క్లియర్ అయింది. ఇక..బీజేపీతో అధికారికంగా దూరం అవ్వటం.. టీడీపీకి దగ్గర అవ్వటం లాంఛనంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+