వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపికి అమిత్ షా షాక్: భేటీ వాయిదా, పొత్తుపై స్పష్టత లేనట్లే...

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో మంగళవారం బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా తలపెట్టిన సమావేశం రద్దయింది. ఈ సమావేశం మళ్లీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అయితే, తెలంగాణ బిజెపి నేతలు ఫిబ్రవరిర 1వ తేదీన అమిత్ షాను కలిసే అవకాశం ఉంది.

టిడిపి పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి, తోట నరసింహం మంగళవారంనాడు అమిత్ షాను కలవాల్సిందే. ఈ సమావేశంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ నాయకులు చంద్రబాబు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను అమిత్ షా దృష్టికి తీసుకుని వెళ్లి స్పష్టత రాబట్టుకోవాలని టిడిపి ఎంపీలు అనుకున్నారు.

ఆ సమావేశం దానికైనా గానీ

ఆ సమావేశం దానికైనా గానీ


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు డిలిమిటేషన్ బిల్లుకు సవరణలు చేయాల్సిన విషయంపై చర్చించేందుకు అమిత్ షా ఆ సమావేశాన్నితలపెట్టారు. అయితే, ఈ భేటీని అవకాశంంగా తీసుకుని రాష్ట్ర బిజెపి నేతల తీరును ఆయన దృష్టికి తేవాలని టిడిపి ఎంపీలు భావించారు.

వారికన్నా ముందు...

వారికన్నా ముందు...

అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచే విషయంపై ముందుగా అమిత్ షా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బిజెపి నాయకుల అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకున్నారు. అలా చేస్తే పార్టీకి కలిగి లాభనష్టాలపై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని భావించారు. ఆ తర్వాత టిడిపి నేతలతో సమావేశం కావాలని భావించారు.

వారి నుంచి ఒత్తిడి...

వారి నుంచి ఒత్తిడి...

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడు నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ నాయకుల అభిప్రాయాలను తెసుకోవాలని అమిత్ షా అనుకున్నారు.

సీట్లు ఇలా పెరుగుతాయి.

సీట్లు ఇలా పెరుగుతాయి.


బిల్లుకు సవరణ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సంఖ్య 119 నుంచి 153కు పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నుంచి 225కు పెరుగుతుంది. సీట్ల సంఖ్య పెంపుపై ప్రధాని నరేంద్ర మోడీకి సిఫార్సు చేసే ముందు అమిత్ షా తమ పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటారు.

English summary
BJP president Amit Shah's proposed meeting with Telugu Desam leaders Sujana Chowdary and Thota Narasimham on Tuesday was postponed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X