వైసీపీ పాలన పై బీజేపీ చీఫ్ నడ్డా కామెంట్స్ - పొత్తు పై సంకేతాలు..!!
బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ పాలన పైన జగత్ ప్రకాశ్ నడ్డా పలు ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో కుంభకోణాలకు విరామం లేదని వ్యాఖ్యానించారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసారని ఆరోపించారు.
రాయలసీమ అభివృద్ధిని కూడా వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని.. ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే సీమను వృద్ధి బాటలోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పొత్తులపై చర్చ వేళ నడ్డా కామెంట్స్ కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి.

వైసీపీ పాలనపై ఆరోపణలు: చూడలేదన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ పాలన 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన 'జనసంపర్క్ అభియాన్'లో భాగంగా శ్రీకాళహస్తి బహిరంగ సభలో నడ్డా ప్రసంగించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు మోదీ నిరంతరం శ్రమిస్తుంటే.. ఆంధ్రలో మాత్రం దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. కేంద్ర నిధులను దారిమళ్లిస్తూ అసమర్థ ప్రభుత్వంగా వైసీపీ నిలిచిందని చెప్పారు.
అవినీతికి పెద్దపీట వేసిందన్నారు. రాయలసీమ అభివృద్ధిని కూడా వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని.. ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే సీమను వృద్ధి బాటలోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మోదీ అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నారని.. 9ఏళ్లుగా రాజకీయాల దృక్పథాన్నే మార్చేశారని తెలిపారు.
నడ్డా వ్యాఖ్యల కలకలం: వైసీపీ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వంగా మారిందని నడ్డా ఆరోపించారు. మైనింగ్, లిక్కర్, ల్యాండ్, శాండ్, ఎడ్యుకేషన్ ఇలా...అనేక రంగాల్లో కుంభకోణాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని ధ్వజమెత్తారు. పాలకుడు తనకు తోచినపని చేయకూడదు.
ప్రజలకు ఏది మంచో అలాంటి పనులు చేయాలని పెద్దలు చెప్పిన మాట' అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. గడచిన 9ఏళ్ల పాలనలో బీజేపీ ఎలాంటి పాలన అందించిందో, నాలుగేళ్లలో వైసీపీ నుంచి ఎలాంటి పాలన అందుకుంటున్నామో ప్రజలు బేరీజు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పొత్తుపై సంకేతాలేనా: ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా..నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపైన చర్చించారు. ఇంతా తుది నిర్ణయం జరగలేదు. ఈ సమయంలో ఏపీకి వచ్చిన జేపీ నడ్డా వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. ఇవి రాజకీయంగా చేసిన విమర్శలా.. లేక టీడీపీతో పొత్తు దిశగా ఇచ్చిన సంకేతాలా అనే చర్చ మొదలైంది.
కేంద్రంలోని ముఖ్యులు..ఏపీ సీఎం జగన్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్న సమయంలో నడ్డా చేసిన వ్యాఖ్యలు అనేక రకాల సందేహాలకు కారణమవుతున్నాయి. ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ విశాఖ సభలో పాల్గొంటున్నారు. పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఆ సమయంలో పొత్తుల అంశం పైన స్పష్టత ఇస్తారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications