వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తోంది-సీఈసీకి బీజేపీ ఫిర్యాదు : బద్వేలులో 44.82 శాతం పోలింగ్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

కడప జిల్లా బద్వేలులో జరుగున్న ఉప ఎన్నిక పోలింగ్ పైన బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పలువురు దొంగ ఓటర్‌ ఐడీలతో వైసీపీ ఓట్లు వేయించిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోరుమామిళ్ల మండలంలో 58, అట్లూర్ 24, బి. కోడూరులలో 21 పోలింగ్ బూత్ లలో రిగ్గింగ్ జరిగుతోందని సీఈసీ దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నేతలు. వైసీపీ నేతలు చేస్తోన్న రిగ్గింగును అడ్డుకోవాలని బీజేపీ సీఈసీని కోరింది. పరిస్థితి రీ-పోలింగ్‌ వరకు వెళ్లకుండా చూడాలని బీజేపీ విజ్ఞప్తి చేసింది. వైసీసీనేతలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.

వైసీపీ డబ్బులు పంచుతోందంటూ

వైసీపీ డబ్బులు పంచుతోందంటూ


ఉప ఎన్నిక సందర్భంగా పలువురు నేతలు డబ్బు పంచుతున్నారని ఆరోపలు వస్తున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చటు చేసుకుంది. బద్వేలు ఉప ఎన్నికల్లో 103 పోలింగ్ బూత్లలో రిగ్గింగ్ జరుగుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై సీఈసీకి ఫిర్యాదు చేశామని స్థానిక నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బద్వేలులోని 281 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11గంటల మధ్యాహ్నం 3 గంటల వరకు 44.82 శాతం పోలింగ్‌ నమోదు అయింది. ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటింగ్ ప్రక్రియను ఈసీ వీడియో రికార్డ్ చేస్తోంది.

వైసీపీ - బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

వైసీపీ - బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

అలాగే సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. మరో వైపు వాలంటీర్లు సైతం పోలింగ్‌ బూత్‌ల ముందు, గ్రామాల్లో ప్రచారం నిర్వహించడమేంటని ప్రశ్నించారు. బయటి నుంచి కొందరూ వ్యక్తులను పిలిపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీజేపీ అంటోంది. దీంతో వైసీపీ, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు వైసీపీ21వ వార్డు కౌన్సిలర్‌ భూమిరెడ్డి ఓబుల్‌ రెడ్డి ఓటర్లకు డబ్బు పంచుతూ దొరికిన కూడా పోలీసులు ఏం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ప్రశ్నించారు.

యాభై శాతానికి దగ్గరగా పోలింగ్

యాభై శాతానికి దగ్గరగా పోలింగ్

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బద్వేలులో 77.64శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,07,915 మంది పురుషులు, 1,07,355 మంది మహిళలు, 22 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ కు సమయం ఉంది. ఆ సమయానికి క్యూ లైన్ లో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేసారు.

రీ పోలింగ్ దాకా తీసుకురావద్దంటూ

రీ పోలింగ్ దాకా తీసుకురావద్దంటూ


ఇక, ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అయితే, ఎక్కడా గొడవలు లేవని..ప్రశాంతంగా పోలింగ్ సాగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు మాత్రం వైసీపీ నేతల తీరు పైన ఫిర్యాదులు చేస్తున్నారు. గతం కంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బద్వేలులో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ వెల్లడించారు.

English summary
BJP complaint on YCP ldears to the cec on fake voters entering in polling booths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X