వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: జగన్‌పై బీజేపీ 'సెకండ్ థాట్', అక్కడే ఇద్దరికీ చిక్కులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

BJP's Second Thoughts On YS Jagan

అమరావతి: ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మరోసారి గట్టిగా చెబుతున్న ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరికైనా, ఏ రాష్ట్రానికైనా అన్యాయం జరిగితే దేశంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లే బాధ్యత వహించాలన్నారు. ఈ రెండు పార్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించకుంటే దేశానికి మంచిది కాదన్నారు.

చంద్రబాబు క్రమంగా స్వరం పెంచడాన్ని బీజేపీ గమనిస్తోంది. ఆయన వ్యాఖ్యల గూడార్థం ఏమిటని కొందరు బీజేపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. అంటే ఎన్డీయే నుంచి బయటకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా లేక ఏపీ కోసమా అనే చర్చ సాగుతోందట. విడతలవారీగా ఇస్తున్నప్పుడు స్వరం ఎందుకు పెంచుతున్నారని చర్చించుకుంటున్నారని తెలుస్తోంది.

ఆసక్తికరం: ప్రధాని మోడీతో మళ్లీ చర్చలు, జగన్‌కు పీకే షాకిస్తారా?ఆసక్తికరం: ప్రధాని మోడీతో మళ్లీ చర్చలు, జగన్‌కు పీకే షాకిస్తారా?

పవన్ కళ్యాణ్ కోసమా.. చంద్రబాబు మనసులో ఏముంది

పవన్ కళ్యాణ్ కోసమా.. చంద్రబాబు మనసులో ఏముంది

ప్రత్యేక హోదా నేపథ్యంలో ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు రూటు మార్చారా? లేక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు దగ్గర కావాలంటే బీజేపీతో ప్రస్తుతానికి దూరం జరగడమే మంచిదని భావిస్తున్నారా? ఆయన మనసులో ఏముందనే అంశంపై బీజేపీలో చర్చ సాగుతోందని తెలుస్తోంది.

బీజేపీకి ప్రత్యామ్నాయం

బీజేపీకి ప్రత్యామ్నాయం

2019లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు తమకు దూరం జరగాలనుకుంటే.. అనే ఆలోచనలో ఉన్న బీజేపీ.. వైసీపీతోను చర్చలు జరుపుతోందనే ప్రచారం సాగుతోంది. ఏపీకి చెందిన కొందరు బీజేపీ నేతల మనసుల్లో తమతో కాకుండా, వైసీపీతో జత కట్టాలని భావిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు కూడా చెబుతున్నారు.

టీడీపీ దూరమైతే వైసీపీకి అక్కడే చిక్కు

టీడీపీ దూరమైతే వైసీపీకి అక్కడే చిక్కు

టీడీపీ దూరమైతే వైసీపీని చేర్చుకోవాలని బీజేపీ భావిస్తుండవచ్చు. వైసీపీకి కూడా ప్రస్తుతానికి కేసులు, ఇతర ఇబ్బందుల దృష్ట్యా ఎన్డీయేలో చేరాలని భావించవచ్చు. కానీ ఏ ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు బీజేపీకి గుడ్ బై చెబుతున్నారో... దానిని వైసీపీ పక్కన పెడితే ఆ పార్టీకి నష్టం. కాబట్టి బీజేపీ, వైసీపీలు కలిసి కాకుండా ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందని, ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరే ఆలోచన చేస్తుందని అంటున్నారు.

బీజేపీ సెకండ్ థాట్

బీజేపీ సెకండ్ థాట్

టీడీపీ, చంద్రబాబు ఆలోచనలను బట్టి అవసరమైతే వైసీపీతోను ముందుకు వెళ్లేందుకు ఏపీ బీజేపీలో కొందరు నేతలు కూడా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. టీడీపీ పరిస్థితిని బట్టి ముందుకు వెళ్లాలని బీజేపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. అందుకే జగన్‌ను ప్రత్యామ్నాయంగా చూస్తుండటంతో పాటు రాయలసీమ వంటి అంశాలను బీజేపీ లేవనెత్తుతోందని అంటున్నారు.

బీజేపీకి మరో చిక్కు, జగన్‌తో దోస్తీపై బీజేపీ సెకండ్ థాట్

బీజేపీకి మరో చిక్కు, జగన్‌తో దోస్తీపై బీజేపీ సెకండ్ థాట్

2014లో బీజేపీ అధికారంలోకి రావడానికి అవినీతిరహిత పాలన నినాదం కూడా ఓ కారణం. పదేళ్ల యూపీఏ హయాంలో ఎన్నో స్కాంలు బయటపడ్డాయి. కానీ మోడీ హయాంలో అలాంటివి కనిపించడం లేదు. ఇప్పుడు కేసులు ఉన్న జగన్‌తో జత కలిస్తే.. అనే రెండో ఆలోచన కూడా చేస్తోందని అంటున్నారు. అయితే కేసులు వేరు, ప్రూవ్ కావడం వేరని కొందరు అంటున్నారు.

English summary
Reports that the BJP could consider an alliance with the YSR Congress have, according to BJP leaders, left the TDP leadership worried. “Such reports seemed to have made the TDP soften its hard stand,” said a leader from the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X