ఫ్యాక్షన్ హత్యలను మరోసారి తెరమీదికి తెచ్చారు: బాబుపై పురంధేశ్వరి ఫైర్
వైఎస్ఆర్ సీపీ పత్తికొండ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య అత్యంత దురకృష్టకరమన్నారు బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి.
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ పత్తికొండ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య అత్యంత దురకృష్టకరమన్నారు బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి.
సోమవారం నాడు ఆమె బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యతో భేటీ అయిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. కర్నూల్ లో సమసిపోయిందనుకొన్న ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ తెరమీదకు తీసుకురావడం విచారకరమన్నారామె.

మరో వైపు పత్తికొండ వైఎస్ఆర్ సీపీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డిది రాజకీయ హత్యేనని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
ఈ హత్యలకు టీడీపి ప్రభుత్వమే భాద్యత వహించాలన్నారు. చంద్రబాబు మాటలు అబద్దాలుగా మిగిలిపోయాయని ఆయన విమర్శించారు.
రాజకీయ హత్యలపై ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు.హత్య రాజకీయాలకు బిజెపి వ్యతిరేకమన్నారు. రాజకీయ హత్యలను తాము ఖండిస్తున్నట్టు చెప్పారాయన. మరో వైపు ఈ హత్యను బిజెపి నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, సోమువీర్రాజులు ఖండించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications