టార్గెట్ జగన్ - నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ..సేమ్ ' మెగా' ప్లాన్..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి కట్టిన మూడు పార్టీలు తమ ఫ్యూచర్ రాజకీయం కోసం కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. పొత్తులో కొనసాగుతునే రాష్ట్రంలో బలోపేతం అయ్యేందుకు ఇదే సరైన సమయంగా బీజేపీ నాయకత్వం భావిస్తోంది. పవన్ సైతం ఇదే తరహాలో ఆలోచనలో ఉన్నారు. ప్లనరీ వేదికగా తన మిషన్ -2029 ప్రకటించనున్నారు. ఇక, చంద్రబాబు ఈ ఇద్దరితో కలిసి ఉంటూనే..తన రూటులో తాను వెళ్తున్నారు. ఇక, బీజేపీ ఏపీలో అమలు చేస్తున్న కొత్త ప్లాన్ ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
బీజేపీ కొత్త లెక్కలు
ఏపీలో బలం పెంచుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు సిద్దం చేసింది. కూటమి పార్టీలతో ఉంటూ నే తమ పార్టీలోకి కీలక నేతలను నేర్చుకునేలా ప్లాన్ అమలు చేస్తోంది. అందులో భాగంగా వైసీపీ నుంచి వస్తున్న నేతల చేరికల పైన అభ్యంతరాలు ఉన్నా.. పట్టించుకోవటం లేదు. వైసీపీ రాజ్యసభ సభ్యులతో టచ్ లోకి వెళ్లింది. రాజీనామా చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారిని తమ పార్టీలో చేర్చుకునేలా మిత్రపక్షాలకు తేల్చి చెప్పింది. ఇదే సమయంలో ఏపీలో పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం పైన కసరత్తు చేస్తోంది.

చిరంజీవి - కిరణ్
ఏపీలో బీజేపీ అధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ లో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని రాయలసీమ ప్రాంతం నుంచి రెడ్డి నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అదే సమయంలో చిరంజీవికి బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని పైన మెగాస్టార్ తన నిర్ణయం చెప్పాల్సి ఉంది. చిరంజీవి అంగీకరిస్తే కీలక బాధ్యతలు అప్పగించేందుకు బీజేపీ సిద్దం అయినట్లుగా సమాచారం. మాజీ సీఎం కిరణ్ కు పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు లేదా రాజ్యసభకు పంపేలా కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరి విషయంలో బీజేపీ ఆలోచనలతో రాష్ట్రంలో 2010 సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.
2010 సీన్ రిపీట్
జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సమయంలో నాడు కాంగ్రెస్ అధినాయకత్వం చిరంజీవి ని కేంద్ర మంత్రిని చేసింది. కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది. జగన్ కారణంగా తమ పార్టీకి నష్టం లేకుండా.. ఈ ఇద్దరికీ బాధ్యతలు అప్పగించింది. కానీ, జగన్ జైలులో ఉన్న సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ ఇద్దరూ వైసీపీ గెలుపును అడ్డుకోలేక పోయారు. 2014 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు. ఇక, ఇప్పుడు బీజేపీ తిరిగి అదే ఇద్దరితో ఏపీలో రాజకీయం చేసేందుకు సిద్దం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కొత్త అడుగులు వేస్తోంది. దీంతో.. ఏపీలో రానున్న రోజుల్లో చోటు చేసుకునే రాజకీయం పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది.
జగన్ ని రాజకీయంగా దెబ్బతియ్యాలి అని 2010 లో కూడా వీళ్ళ ఇద్దరికీ పదవులు ఇచ్చి కాంగ్రెస్ మంచి పని చేసింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications