టీడీపీ- జనసేనకు పోటీగా, బీజేపీ కీలక నిర్ణయం: రంగంలోకి కేంద్ర మంత్రులు..!!
ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర రాజకీయం జరుగుతోంది. పొత్తుల చర్చల సమయంలోనే కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 28న టీడీపీ, జనసేన ఎన్నికల సమాయత్తంలో భాగంగా భారీ బహిరంగ సభకు నిర్ణయించాయి. దీంతో, ముందు రోజునే బీజేపీ మరో సభ నిర్వహణకు నిర్ణయించింది. పొత్తులతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాల్లో పోటీకి సిద్దమవుతున్నట్లు పార్టీ ప్రకటించింది. దీంతో..అసలు పొత్తు ఉన్నట్లా, లేనట్లా అనే చర్చ మొదలైంది.
కీలక పరిణామాలు
ఏపీలో పొత్తుల రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీతో పొత్తు కోసం తాను జాతీయ నేతలతో చివాట్లు తిని ఒప్పించానని పవన్ చెప్పుకొచ్చారు. టీడీపీ, బీజేపీ నుంచి మాత్రం పొత్తు పైన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా తో భేటీ తరువాత పొత్తు ఖాయమనే చర్చ మొదలైంది. సీట్ల సర్దుబాటు గురించి పలు ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. ఈ నెలాఖరులోగా పొత్తుల పైన నిర్ణయం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.ఈ సమయంలోనే టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నెల 28న తాడేపల్లి గూడెంలో భారీ బహిరంగ సభకు టీడీపీ, జనసేన నేతలు నిర్ణయించారు. చంద్రబాబు, పవన్ ఈ సభలో పాల్గొంటారని వెళ్లడించారు.

బీజేపీ కీలక నిర్ణయం
ఈ సమయంలోనే బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ, జనసేన సభ కంటే ఒక రోజు ముందుగానే ఏలూరులో బహిరంగ సభకు నిర్ణయించింది. ఈ సభకు కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ సభ గురించి ప్రకటన చేసిన పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేసారు. పొత్తులు ఎలా ఉన్నా అన్ని నియోజకవర్గాల్లో పోటీకి సిద్దం అవుతున్నట్లు వెల్లడించారు. పొత్తుల అంశం కేంద్ర నాయకత్వం పరిశీలనలో ఉందని.. పార్టీ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. అధిష్ఠానం సూచన మేరకే ఈ సభ నిర్వహిస్తున్నట్లు పురందేశ్వరి స్పష్టం చేసారు. దీని ద్వారా అసలు బీజేపీ కేంద్ర నాయకత్వం ఏ ఆలోచన చేస్తుందనేది ఇప్పుడు బీజేపీ నేతలతో పాటుగా, టీడీపీ - జనసేన ముఖ్యులకు అంతు చిక్కటం లేదు. వరుసగా రెండు సభలు పశ్చిమ గోదావరి కేంద్రంగా జరగటం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.
పొత్తుల్లో ఏం జరుగుతోంది
ఇటు పొత్తులపైన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. బీజేపీతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలో విషయం చెబుతామన్నారు. ఎన్డీయేలో చేరిక పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ కూడా పాల్గొనేలా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ-జనసేన నిర్ణయించాయి. ఎన్డీయేలో చేరిక, బీజేపీతో సీట్ల సర్దుబాటు నెలాఖరులోపు పూర్తవుతాయని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఇటు బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీలో అందునా గోదావరి జిల్లాలోనే బహిరంగ సభ నిర్వహించాలని పొత్తుల సమయంలో సూచించటం కొత్త సమీకరణాలకు కారణంగా కనిపిస్తోంది. దీంతో..పొత్తుల విషయంలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనే ఆసక్తి రాజకీయంగా నెలకొంది.
-
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications