టీడీపీ, బీజేపీ పొత్తు - విష్ణుకుమార్‌రాజు పై పార్టీ సీరియస్..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. 2024 ఎన్నికల పొత్తులపై ఇప్పుడు ఏపీలో చర్చ సాగుతోంది. టీడీపీ- జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న సమయంలో బీజేపీ కూడా కలుస్తుందనే వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేసిన కారణంగా ఇప్పుడు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజుకు ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. పొత్తులపై స్థాయిని మరిచి మాట్లాడినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో, విష్ణుకుమార్ రాజు నెక్స్ట్ స్టెప్ కీలకం కానుంది.

ఏపీలో కొంత మంది నేతలు పదే పదే టీడీపీతో పొత్తు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ పొత్తుల గురించి ప్రస్తావన చేసారు. నోటీసు ఇచ్చిన బీజేపీ నాయకత్వం సాయంత్రం లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బీజేపీకి ఏపీలో ఒక్క సీటు రాదని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం సాగింది. దీని పైన పార్టీ వివరణ కోరగా పూర్తి సమాచారం..ఆధారాలతో ఆయన వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో తాజాగా నోటీసు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక, పొత్తుల అంశం లో స్థాయిని మరిచి మాట్లాడినందుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించామని ఆ నోటీసులో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.

Vishnu Kumar Raju

విష్ణుకుమార్ రాజు మరోసారి ఏపీలో జనసేన, టీడీపీతో కలిసి బీజేపీ పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నారనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడి టీడీపీలో చేరే సమయంలో గుంటూరు వెళ్లి ఆయన్ను కలిసారు. పార్టీని వీడిన వ్యక్తి వద్దకు వెళ్లి కలవటం తో బీజేపీ చర్చకు దారి తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై కన్నా చేసిన వ్యాఖ్యలతో ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. విష్ణుకుమార్ రాజు కొంత కాలంగా టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారనే వాదన ఉంది. టీడీపీలో అధికారికంగా చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారని పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల పైన వివరణ కోరినట్లు సమాచారం.

Vishnu Kumar Raju

2014 ఎన్నికల్లో బీజేపీ- టీడీపీ పొత్తులో భాగంగా విష్ణుకుమార్ రాజు విశాఖ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. బీజేపీ వాయిస్ బలంగా వినిపించిన విష్ణుకుమార్ రాజు ఈ మధ్య కాలంలో టీడీపీకి అనుకూలంగా తన వాయిస్ వినిపిస్తున్నారు. పవన్ కల్యాణ్ పైన కొన్ని సందర్భాల్లో విమర్శలు, మరి కొన్ని సమయాల్లో ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు విష్ణుకుమార్ రాజుకు పార్టీ నోటీసులు ఇచ్చిన వ్యవహారం చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారం పైన బీజేపీ నేతలు..విష్ణుకుమార్ రాజు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇక, విష్ణుకుమార్ రాజు ప్రచారం సాగుతున్నట్లుగా టీడీపీలోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+