ఏపీలో బీజేపీకి దక్కే స్థానాలు - తేల్చిన ఢిల్లీ నేతలు..!!

ఏపీలో అధికారం దక్కేదెవరికి. తుది ఫలితాల పై ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపు పైన ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని విశ్వాసంతో ఉన్నారు. టీడీపీ కూటమి నేతలు గెలుపు పైన నమ్మకంతో కనిపిస్తున్నారు. ఇక..కూటమిలో పార్టీలైన బీజేపీ, టీడీపీ, జనసేన కు వచ్చే సీట్ల పైన అంచనాలు వెల్లడవుతున్నాయి. ఢిల్లీ బీజేపీ నేతలు ఏపీలో ఎన్నికల సరళి పైన పూర్తి సమాచారం సేకరించారు. ఫలితాల పై ఒక అంచనాకు వచ్చారు.

బీజేపీ నేతల లెక్కలు
ఏపీలో బీజేపీ ఆరు ఎంపీలు..పది ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసింది. పోలింగ్ సరళి గురించి బీజేపీ నాయకత్వం క్షేత్ర స్థాయి నుంచి సమాచారం సేకరించింది. ఏపీలో మెజార్టీ ఓటింగ్..అధికారం ఎవరికి దక్కుతుంద నే అంశం పైన దాదాపు ఒక అంచనాకు వచ్చింది.

BJP Latest predictions over seats winning in Andhra Pradesh see details

ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు పోలయ్యాయి..ఏ వర్గాల నుంచి మద్దతు లభించిందనే అంశం పైన పూర్తి స్తాయిలో విశ్లేషణ జరిగినట్లు సమాచారం. ఇక, తమ పార్టీ అభ్యర్దులు పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఎక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయనే లెక్కల పైన పార్టీ నాయకత్వం కసరత్తు చేసింది. అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

భారీ అంచనాలు
బీజేపీ పోటీ చేసిన ఆరు స్థానాల్లో మిత్రపక్ష పార్టీల నుంచి జరిగిన ఓట్ల బదిలీ గురించి ప్రధానంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో రెండు, గోదావరి జిల్లాల్లో రెండు, సీమ ప్రాంతంలో రెండు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. అందులో రెండు స్థానాల్లో గెలుపు ఖాయమనే అంచనాకు పార్టీ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి పూర్తిగా అనుకూలంగా జరిగిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. గోదావరి జిల్లాలో పార్టీ సీనియర్ కార్యకర్తకు ఎంపీగా అవకాశం ఇచ్చిన నియోజకవర్గంలో అనూహ్య విజయం దక్కనుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు.

కలిసొచ్చేదెక్కడ
ప్రధాని ప్రచార సభలో పాల్గొన్న మరో నియోజకవర్గంలో మాత్రం ఆశించిన స్థాయిలో సానుకూల ఓటింగ్ జరగలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.జగన్ అమలు చేసిన సామాజిక సమీకరణాలు కొంత మేర ోట్ బ్యాంక్ ను దెబ్బ తీసాయని...కానీ, బీజేపీకి సీట్లు ఖాయమనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ స్థానాల్లోనూ నాలుగు నియోజకవర్గాల పైన ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు.

రెండు స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమగా చెబుతున్నారు. మరో రెండు నియోజకవర్గాల్లో కౌంటింగ్ రోజున మాత్రమే తేలే అవకాశం ఉంది...ఆ స్థాయిలో గట్టి పోటి ఇవ్వగలిగామని వివరిస్తున్నారు. దీంతో..బీజేపీ నేతల అంచనాలు ఏ మేర నిజం అవుతాయనేనది జూన్ 4న తేలనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+