వైసీపీలో చేరిన బీజేపీ నేత ఏలేశ్వరపు: అలా చేస్తారా? అంటూ జగన్‌పై ఐఏఎస్‌ల ఫైర్
భారతీయ జనతా పార్టీ నేత ఏలేశ్వరపు జగన్ మోహన రాజు బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నేత ఏలేశ్వరపు జగన్ మోహన రాజు బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

వైసీపీలో చేరిన ఏలేశ్వరపు
జగన్ మోహన్ రాజుతోపాటు పలువురు నేతలు, అనుచరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం జగన్ మోహన రాజు హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ మోహన రాజు మాట్లాడుతూ.. వైయస్ జగన్ చేస్తున్న పోరాటాలే తనకు స్ఫూర్తి అని అన్నారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

జగన్‌పై ఐఏఎస్ అధికారుల సంఘం ఆగ్రహం
అమరావతి: ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మంగళవారం నందిగామ ప్రభుత్వాసుపత్రిలో కృష్ణా జిల్లా కలెక్టర్‌పై జగన్‌మోహన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని సంఘం మండిపడింది.

చేయి వేసి మాట్లాడటంపై అభ్యంతరం
అధికారుల సంఘం సమావేశం బుధవారం ఉదయం 11:30గంటలకు సచివాలయంలో జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఏకే ఫరీదా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈసందర్బంగా కలెక్టర్‌పై జగన్ చేయి వేసి మాట్లాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఆస్పత్రిలో కలెక్టర్
బస్సు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, వైద్యులను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్. ముళ్లపాడు వద్ద కల్వర్టులో బస్సు పడిపోవడంతో 11మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 30మంది గాయాలపాలయ్యారు.












Click it and Unblock the Notifications