లెక్కల్లో Ys జగన్ ట్యాంపరింగ్?

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆశించిన ఫలితాలను సాధించడంలో ఘోరంగా విఫలమైందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ మండిపడ్డారు. అయినప్పటికీ ఉత్తుత్తి ప్రకటనలు, తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ట్విటర్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి రక్షిత మంచి నీటిని అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం ప్రవేశపెట్టిందని, ఏపీలో ఈ పథకం అమలు అధ్వాన్నంగా ఉందని సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని ఏపీలో 100 శాతం మేర అమలు చేశామని చెబుతూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపిందని తెలిపారు.

bjp leader satyakumar comments on ys jagan government

వాస్తవానికి ఏపీలో కేవలం 20 శాతం గ్రామాలకు మాత్రమే జల్ జీవన్ మిషన్ పథకం ఫలాలు అందాయని, మిషన్ లెక్కలను ముఖ్యమంత్రి జగన్ టాంపరింగ్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని 3,544 గ్రామాలకు 100 శాతం కుళాయి కనెక్షన్ ఇచ్చినట్లు లెక్కలు చూపారని వెల్లడించారు. కానీ 735 గ్రామ పంచాయతీల్లో మాత్రమే పని పూర్తయిందన్నారు. కేవలం 20.74 శాతం మందికి మాత్రమే పథకం ఫలాలు అందాయని వివరించారు.

మిగిలిన 80.26% మొత్తం మోసమేనని సత్యకుమార్ స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు లెక్కలు చూపించడంలో జగన్ సిద్ధహస్తుడన్నారు. తప్పుడు ప్రచారం చేస్తూనే జగన్ మూడున్నరేళ్ల పాటు పాలన సాగించారని, తప్పుడు సలహాలివ్వడానికి ప్రత్యేకంగా 45 మంది సలహాదారులను పెట్టుకొని వారికి రూ.130 కోట్లు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+