జగన్ మన ఊహలకు అందడు.. బీజేపీ నేత సంచలన కామెంట్స్

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టీడపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ , జనసేన పొత్తుతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమే అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు ఖారారైంది. బీజేపీ వీరితో ఎంత వరకు కలిసి వస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి.

అయితే ఎంతమంది కలిసినప్పటికీ గెలుపు తమదే అని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి తమను అధికారంలోకి తీసుకువస్తాయని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ నేత సుజనా చౌదరి సీఎం జగన్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. ఓపెన్ విత్ ఆర్కే ప్రొగ్రాంకు అతిథిగా వచ్చిన సుజనా చౌదరి ప్రస్తుత రాజకీయాలపై తనదైనశైలిలో స్పందించారు.

 Bjp leader

చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పని అనడం లేదని..అరెస్ట్ చేసిన పద్దతి కరెక్ట్ కాదని సుజనా చౌదరి చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబును అరెస్ట్ చేయడానికి జగన్ ఏమీ తెలివి తక్కువ వ్యక్తి కాదని సుజనా చౌదరి తెలిపారు. జగన్‌ను కాని .. ఆయన పార్టీని కాని తక్కువ అంచన వేయడానికి వీల్లేదని..ఆయనకు ఆపారమైన తెలివితేటలు ఉన్నాయని సుజనా చౌదరి ఈ ఇంటర్య్వూలో వెల్లడించారు.

 cm jagan

జగన్ నిత్యం రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలపైనే నిమగ్నమై ఉంటారని .. ఆయన మన ఊహలకు కూడా అందరని సుజనా చౌదరి చెప్పడం సంచలనంగా మారింది. బీజేపీ నేత సుజనా చౌదరి జగన్ గురించి ఇలా గొప్పగా మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సుజనా చౌదరి జగన్ గురించి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల పవన్ కల్యాణ్ కూడా జగన్‌ను తక్కువ అంచనా వేయడం లేదని..ఆయన్ను ఓడించడానికే టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+