'మీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లా మాట్లాడకండి, ఎక్కడో చెప్పాలి'

అమరావతి: బీజేపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లా మాట్లాడకుండా అవినీతి ఆరోపణలు చేస్తే, ఎక్కడ జరిగిందో నిరూపించాలని మంత్రి, టీడీపీ నేత పీ నారాయణ అన్నారు. కేంద్రం విభజన హామీలను ఒక్కదానిని నెరవేర్చలేదని మండిపడ్డారు. కేంద్రం నిదులతో ఏపీ అభివృద్ధి చెందుతోందని బీజేపీ నేతలు చెప్పడం హాస్యాస్పదం అన్నారు.

రాష్ట్రాలు కట్టే పన్నులే కేంద్రం తిరిగి చెల్లిస్తోందన్నారు. నాలుగేళ్లయినా ఏపీకి రైల్వే జోన్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీకి తెలియదా అని మండిపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 25 సీట్లు గెలిచి ప్రధానిని నిర్ణయించే స్థాయికి ఎదుగుతామని చెప్పారు. బీజేపీ, వైసీపీ, జనసేనలు కలిసి ఏపీకి అన్యాయం చేస్తున్నాయన్నారు.

BJP leaders dont talk like Pawan Kalyan, Minister Narayana

మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు సొంత జిల్లా ప్రయోజనాలే పట్టవన్నారు. జగన్ ప్రధాని మోడీ ప్రేమలో పడ్డారన్నారు. అందువల్లే ఆయనను పల్లెత్తు మాట అనడం లేదన్నారు. బీజేపీ, వైసీపీ రెండూ దొంగల పార్టీలు అన్నారు. అవినీతిపరులకు అండగా ఉండే జగన్‌కు ప్రజా సమస్యలు పట్టవన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+