టీడీపీతో పొత్తుకు బీజేపీ నో- పవన్ నెక్స్ట్ స్టెప్..!?
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పొత్తులాట కొత్త మలుపు తిరిగింది. టీడీపీ, జనసేన ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని భావిస్తున్నాయి. ఈ సమయం లోనే బీజేపీ ఆలోచన వేరుగా ఉన్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. పవన్ కల్యాణ్ ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నారు. బీజేపీ నిర్ణయం అధికారికంగా వెల్లడిస్తే..పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నార నేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
బీజేపీ కలవదా
ఏపీలో పొత్తుల లెక్కల్లో స్పష్టత వస్తోంది. కేంద్రంలోని బీజేపీ నాయకత్వం దేశ వ్యాప్తంగా 400 సీట్లు సాధించటమే లక్ష్యంగా ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. దాదాపు 125 స్థానాల్లో అభ్యర్దులను ఖరారు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితుల పైన కీలక నాయకత్వం చర్చలు చేసింది. టీడీపీతో పొత్త పైన చర్చించారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి వచ్చిన సూచనల పైన కసరత్తు చేసారు. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు అభ్యర్దులను ప్రకటించాయి. బహిరంగ సభ నిర్వహించాయి. ఈ అంశాల పైన వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో పొత్తు తో వెళ్తే ఈ సారికి నాలుగు లేదా అయిదు సీట్లు గెలిచే అవకాశం ఉంటుందని..ఇప్పుడు ఏపీలో పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్ లో ఎదిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

టీడీపీతో పొత్తు లేనట్లేనా
ఏపీలో రాజకీయ పరిస్థితుల పైన నాయకత్వంతో చర్చలు, నివేదిక కోసం జాతీయ నేత శివప్రకాశ్ జీకి పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఏపీకి చెందిన కొందరు ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. పొత్తుల పైన ఆరా తీసారు. ఈ సమావేశానికి పురందేశ్వరితో పాటుగా మరి కొందరు ముఖ్య నేతలు మాత్రమే హాజరయ్యారు. టీడీపీ, జనసేన తమతో ప్రమేయం లేకుండా అభ్యర్దుల ప్రకటన పైన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏపీలో రెండు రోజుల పాటు పార్టీ సమావేశం నిర్వహణకు నిర్ణయించారు. అదే సమయంలో మొత్తం 25 ఎంపీ స్థానాలకు ఒక్కో నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచే ముగ్గురు అభ్యర్దుల పేర్లతో జాబితా సిద్దం చేయాలని జాతీయ నాయకత్వం ఏపీ బీజేపీ నేతలకు సూచించినట్లు సమాచారం.
టీడీపీ - జనసేన కూటమికి షాక్#TDP #JANASENA #BJP #ApElections2024 #AndhraPradesh #ApAssemblyElections2024 #AndhraPradeshElections2024 #Oneindiatelugu pic.twitter.com/DQd9BNebvO
— oneindiatelugu (@oneindiatelugu) March 1, 2024
పవన్ నిర్ణయం ఏంటి
పొత్తుల గురించి ఆలోచించకుండా సొంతంగా బలపడేందుకు వ్యూహాలను రచించాలని.. ఇక పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించినట్లు సమాచారం. దీంతో, ఇక దాదాపు టీడీపీతో బీజేపీ కలిసే అవకాశాలు కనిపించటం లేదనే చర్చ మొదలైంది. ఇటు ఏపీలో మాత్రం ఒకటి రెండు రోజుల్లోనే పొత్తు ఖరారవుతుందనే ప్రచారం సాగింది. ఈ సమయంలోనే బీజేపీ కేంద్ర నాయకత్వం స్పష్టత కోసం శివప్రకాశ్ జీని రంగం లోకి దింపింది. దీంతో..చివరి నిమిషంలో అనూహ్యంగా నిర్ణయాలు మారితే మినహా.. 2014 తరహా పొత్తులు ఈ ఎన్నికల్లో సాధ్యమయ్యే అవకాశం లేదు. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కోసం ప్రయత్నించిన పవన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications