బీజేపీకి జగన్ సరెండర్ ? లిక్కర్ కేసులో భారతి ! వారంలో పులివెందులలో-ఎమ్మెల్యే ఆది షాకింగ్.!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటివరకూ కడప జిల్లాలో ఆధిపత్యం చెలాయించిన వైసీపి కూటమి సునామీలో దారుణ పరాజయాలు చవిచూసింది. కేవలం కడప, రాజంపేట, బద్వేలు సీట్లను మాత్రమే ఈసారి నిలబెట్టుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి గెలిచిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఏం జరగబోతోందో ఆయన జోస్యం చెప్పేశారు.
త్వరలో వైసీపీ బీజేపీకి సరెండర్ అవుతుందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే పులివెందులలో రాజకీయాలు మారబోతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో దోషుల్ని కూడా శిక్షిస్తామని ఆది ఇవాళ ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన దారుణ ఓటమి జగన్ పై తీవ్ర ప్రభావం చూపబోతోందని ఆదినారాయణరెడ్డి తెలిపారు. జగన్ లో కేసుల భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో జగన్ సతీమణి భారతి ప్రమేయంపై సైతం విచారణ చేయిస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. తద్వారా కవిత తరహాలోనే భారతిపై కూడా చర్యలు తప్పవనేలా ఆయన హింట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆది ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే కడప జిల్లాపై సాదించిన ఆధిక్యాన్ని సుస్ధిరం చేసుకునేందుకు బీజేపీ సహా కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది.












Click it and Unblock the Notifications