జగన్ ఓ మూలన నక్కాడు, పవన్! తెలుసుకో: ఎవరికోసమో చెప్పాలని బీజేపీ
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాల ఉచ్చులో పడవద్దని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాల ఉచ్చులో పడవద్దని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో వైసిపి అధినేత వైయస్ జగన్ ఓ మూలన నక్కారని ఆరోపించారు.
వైయస్ జగన్, మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ల గురించి ప్రజలకు తెలుసునని చెప్పారు. జకీయ లబ్దికోసం ఆశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిన సమయంలో జగన్ పార్లమెంట్‌లో ఓ మూలన నక్కారని ఎద్దేవా చేశారు. అప్పట్లో ఎంపీగా ఉన్న ఉండవల్లి చివరి వరకూ విభజన ఆగిపోతుందని మభ్యపెడుతూనే ఉన్నారన్నారు.

మోడీది నిరంకుశ పాలన కాదు
కానీ ఇవాళ యువతను మభ్యపెట్టి, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనను పవన్ కళ్యాణ్ అర్ధం చేసుకోవాలని ఆకుల అన్నారు. నిరంకుశపాలన అని విమర్శించడం సరికాదన్నారు.

అసలు ఈ వాదన ఎవరి కోసమో
అసలు వాదన ప్రజల కోసమా, పారిశ్రామికవేత్తల కోసమా అని జగన్, పవన్ కళ్యాణ్, ఉండవల్లిలను ఆకుల ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఉచ్చులో పవన్ పడకూడదని కోరుకున్నారు. ఇవాళ మోడీ దేశంలో మార్పు తీసుకొస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుంభకోణాలకు పాల్పడింది.

హోదాకు సరిపడే ప్యాకేజీ
ప్రత్యేక హోదాకు సరిపడ ప్యాకేజీని అమలు చేస్తుంటే అనవసర రాద్ధాంతం చేయడం సరికాదని ఆకుల సత్యనారాయణ అన్నారు. వాళ్లమాటలు ప్రజలు నమ్మరని చెప్పారు. వాళ్లను నమ్మి రోడ్లమీదకు వచ్చి లాఠీ దెబ్బలు తినడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఏ విషయాల మీద ఉద్యమాలు చేయాలో ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు.

ప్యాకేజీ వల్ల నిధులు
ప్యాకేజీ వల్ల పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు వచ్చాయని సత్యనారాయణ చెప్పారు. అదనంగా ఎక్స్ ఆర్డనరీ ఎయిడెడ్ ప్రాజెక్టు కూడా వచ్చిందన్నారు. ఇవాళ దక్షిణాది- ఉత్తరాది అనే వాదన నారో మైండ్ వల్ల ఏర్పడిందేనని, ప్రపంచమే ఇవాళ గ్లోబల్ విలేజ్‌గా మారిన విషయం గుర్తించాలన్నారు.

వెంకయ్యనే మాట్లాడారు
తొలుత ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ అన్నారు. రాజ్యసభలో వీరే మాట్లాడారు. ఇంకెవరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడలేదన్నారు. గుజరాత్‌లో మౌలిక సదుపాయాలు చూసి పెట్టుబడులు వచ్చాయని, రాయతీలు చూసి కాదన్నారు. అయినా విభజన తర్వాత ప్యాకేజితో ప్రభుత్వాలు అనేక రాయతీలు ఇస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications