ప్రభుత్వం కిమ్మనట్లేదు, మీరైనా: చానళ్ల బ్యాన్‌పై బీజేపీ

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్‌ను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం కోరారు. బీజేపీ శాసనసభ పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రా రెడ్డి, రాజాసింగ్, పార్టీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

ప్రసారాల నిలిపివేతకు ఎలాంటి కారణంలేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించడంలేదని, ఎంఎస్‌వోలు చట్ట విరుద్ధంగా ప్రసారాలు నిలిపివేసినా కిమ్మనడంలేదని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. కనీసం మీరైనా జోక్యం చేసుకుని ప్రసారాలు ప్రారంభించేలా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

BJP MLAs meet Governor on TV channels ban

కాగా, ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పందించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ప్రసారాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరింది. దీనిపై ఈనెల 19వ తేదీన కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి బిమల్ జుల్కా తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నేరుగా ముఖ్యమంత్రికి కేసీఆర్‌కు లేఖ రాశారు.

‌తెలంగాణలో తమ ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేసిన ఫిర్యాదుపై ఇప్పటికే తమ శాఖ సమాచార కార్యదర్శి లేఖ రాశారని, దీనికి సంబంధించిన వివరాలు తెలపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారని, కానీ ఇప్పటిదాకా జవాబు రాలేదని, వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులని, కేబుల్ ఆపరేటర్లు/మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు అనధికారికంగా టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం ఈ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని, అందువల్ల, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఛానళ్ల ప్రసారాలను పునరుద్ధరించేలా చూడాలని కేసీఆర్‌కు ప్రకాశ్ జవదేకర్ సూచించారు. కాగా జూన్ 24న ఈ లేఖ పంపించారని సమాచారం.

ప్రకాశ్ జవదేకర్ సమీక్ష

తెలంగాణలో టీవీ చానళ్ల నిలిపివేతపై తాను స్వయంగా లేఖ రాసి వారం గడిచినా ఎలాంటి స్పందన రాకపోవడంపై ఆగ్రహించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తన శాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో ప్రత్యేక సమావేశం జరిపారు. అధికారులు కూడా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. హైకోర్టుకు ఇచ్చిన నోటీసులపై ప్రతిస్పందించాల్సిన తీరుపై చర్చలు జరిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+