చంద్రబాబూ! క్వార్టర్స్ నిర్మాణానికి రూ.744 కోట్లు, అవి భూగర్భంలో ఉన్నాయా?: బీజేపీ
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచేలా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ బుధవారం అన్నారు. అడిగిన వాటికి సమాధానం ఇవ్వకుండా సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోడీ వీడియో క్లిప్స్ శాసన సభలో పెట్టడం తప్పని చెప్పారు. జాతీయ అధ్యక్షుడు లేఖ రాస్తే లేఖ ద్వారా స్పందించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై తాము మాట్లాడితే ఏదో రాష్ట్ర ప్రజలపై దాడి జరిగినట్లుగా మాట్లాడుతున్నారన్నారు.

ఎమ్మెల్యే, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.744 కోట్లు ఖర్చు చేశామని యూసీలు పంపినట్లు చంద్రబాబు నాయుడు చెప్పారని, మరి ఆ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని మాధవ్ నిలదీశారు. అవి అమరావతిలో ఉన్నాయా లేక భూగర్భంలో ఉన్నాయా అని నిలదీశారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. అఖిల పక్షానికి మూడు ముఖ్య పార్టీలు హాజరు కాలేదంటే ప్రభుత్వంపై విశ్వాసం లేదని అర్థమని చెప్పారు. అఖిలపక్షానికి వెళ్లిన వామపక్షాలు కూడా విమర్శలు చేశాయన్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications