దుష్టశక్తులున్నాయి, టిడిపి దయతో ఎమ్మెల్సీని కాలేదు: సోము వీర్రాజు సంచలనం

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి, టిడిపి నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరుకొంది. బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇంటిని ముట్టడించేందుకు టిడిపి నేతలు సోమవారం నాడు ప్రయత్నించారు. మరో వైపు సోమువీర్రాజుపై టిడిపి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ గుంటూరులో టిడిపి నేతలు ర్యాలీ నిర్వహించారు.

బడ్జెట్ లో ఏపీ ప్రభుత్వానికి సరైన నిధులను కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ టిడిపి పార్లమెంట్ వేదికగా తమ నిరసన గళాన్ని విన్పిస్తోంది. బిజెపి నాయకత్వం టిడిపి చేస్తున్న ఆందోళనతో మెట్టుదిగినట్టు కన్పిస్తోంది.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి నిధులను కేటాయిస్తామని హమీ ఇచ్చారు. అయితే ఈ హమీపై స్పష్టత లేదని టిడిపి ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. ఏపీ రాష్ట్రంలో మాత్రం బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొంత కాలంగా టిడిపి నేతలపై చేస్తున్న విమర్శలపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవాలు మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా

వాస్తవాలు మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా

కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులతో పాటు రాష్ట్రంలో ఏం జరుగుతోందనే విషయాలపై వాస్తవాలను మాట్లాడితే దాన్ని పట్టించుకోకుండా ఎదురుదాడులకు టిడిపి నేతలు దిగుతున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.టీడీపీకి వ్యతిరేకంగా గుంటూరులో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం భారీ ప్రదర్శన నిర్వహించారు.టీడీపీ వైఖరికి నిరసగా ప్లకార్డులు ప్రదర్శించారు.

దుష్టశక్తుల వల్లే ఇలా జరుగుతోంది

దుష్టశక్తుల వల్లే ఇలా జరుగుతోంది

తనను ఇబ్బంది పెట్టే దుష్టశక్తులున్నాయని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వాస్తవాలు మాట్లాడితే తప్పు పడుతున్నారని వీర్రాజు అభిప్రాయపడ్డారు. తన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నంలో ఎవరున్నారో తనకు తెలుసునని ఓ మీడియా ఛానల్‌తో సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

టిడిపి నేతల విమర్శలకు వీర్రాజు కౌంటర్

టిడిపి నేతల విమర్శలకు వీర్రాజు కౌంటర్

టిడిపి నేతలు బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. పార్టీ సమావేశాలకు విరాళాలు వసూలు చేశారని, వాటికి లెక్కలు చెప్పలేదంటూ టిడిపి నేతలు చేసిన విమర్శలకు వీర్రాజు ధీటుగానే కౌంటర్ ఇచ్చారు. పార్టీ సభలకు విరాళాలు వసూలు చేస్తే వాటికి లెక్కలు చూపే పార్టీ బిజెపి ఒక్కటేనని ఆయన గుర్తు చేశారు.

బిజెపి నాయకత్వం వల్లే ఎమ్మెల్సీ

బిజెపి నాయకత్వం వల్లే ఎమ్మెల్సీ

తనకు టిడిపి వల్ల ఎమ్మెల్సీ పదవి రాలేదని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. టిడిపి, బిజెపి పొత్తుల్లో భాగంగానే తనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందని వీర్రాజు ఓ న్యూష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. టిడిపి దయతో తాను ఎమ్మెల్సీగా ఎన్నిక కాలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+