• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైల్వే జోన్ నిరాకరణ ఫేక్-వైసీపీ ట్రాప్ లో టీడీపీ- జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

కేంద్రం నిన్న జరిగిన హోంశాఖ భేటీలో ఏపీకి రైల్వే జోన్ నిరాకరించినట్లు వచ్చిన వార్తల్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఖండించారు. రైల్వేజోన్ పై ఈ భేటీలో అసలు చర్చే జరగలేదన్నారు. వైసీపీ వేసిన ట్రాప్ లో మరోసారి టీడీపీ పడిందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో పత్రికల్లో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. నిజ నిర్ధారణ లేకుండా వార్త రాస్తే మీ విశ్వసనీయత దెబ్బ తింటుందని హెచ్చరించారు. కేంద్ర‌ క్యాబినెట్ లో నిర్ణయం జరిగాకే రైల్వే జోన్ ఆమోదించారని, ఎవరో ఏదో చెప్పారని అబద్దాలు ఎలా రాస్తారని ప్రశ్నించారు.కేంద్రం గతంలోనే ఒకె చేసినట్లు కధనాలు మీరు చూడలేదా అని అడిగారు. కేంద్ర రైల్వే మంత్రి చెప్పిన సారాంశాన్ని‌ జీవీఎల్ ప్రెస్ మీట్లో చదివి‌ వినిపించారు.

రైల్వే జోన్ ఆమోదం‌ కాకుండా సదుపాయాల గురించి ఎలా ఆలోచిస్తారని జీవీఎల్ ప్రశ్నించారు. అన్ని రకాల సదుపాయాలు కల్పించేలా నిర్మాణం చేయాలని‌ సూచించారని, కొత్త రైల్వే జోన్ నిర్మాణాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందని జీవీఎల్ గుర్తుచేశారు. ఇంత ప్రక్రియ జరిగాక.. ఇలాంటి కధనాలు సమంజసమా అని నిలదీశారు.రైల్వే బోర్డు ఛైర్మన్ త్రిపాఠి తో కూడా తాను స్వయంగా మాట్లాడినట్లు జీవీఎల్ తెలిపారు. అపోహలు తొలగించేలా ప్రకటన ఇవ్వాలని కోరానన్నారు. కొంతమంది చేసే కుట్రల్లో మీడియా భాగం కావద్దని సూచించారు.

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర అధికారులు 29 సమావేశాలు పెట్టారని, 2014 నుండి 2022వరకు కమిటి సభ్యులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారని జీవీఎల్ తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించే దిశగా చర్చ చేయాలన్నారు. ఏపీలో రౌడీయిజం, సెటిల్ మెంట్ తరహాలో సమస్య పరిష్కారం కాదన్నారు. రాజ్యాంగ బద్దంగానే చర్చ చేసి వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. ఈ సమస్యలు పరిష్కారం కోసం సీఎంలు ఎన్నిసార్లు కలిశారని ప్రశ్నించారు. కేసిఆర్ తో గతంలొ చంద్రబాబు కూర్చున్నారా, ఇప్పుడు జగన్ భేటీ అయ్యారా అని నిలదీశారు.వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాల కోసం మాత్రమే కేసిఆర్, జగన్ కలుస్తారా అని జీవీఎల్ ప్రశ్నించారు.టిడిపి, వైసిపి నాయకులు ప్రజా ప్రయోజనాలను ఫణంగా పెట్టారని జీవీఎల్ ఆరోపించారు.

bjp mp gvl narasimharao clarified on railway zone denial rumours, says tdp in ysrcp trap

ఏపీకి ఇంత అన్యాయం జరిగితే జగన్ కు చర్చించే తీరికే లేదా అని జీవీఎల్ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం స్వార్ధాన్ని‌ పక్కన. పెట్టి కేసిఆర్ ను ప్రశ్నించాలన్నారు. ఇక్కడ మీరు కలవరు... ఢిల్లీ వెళ్లి డ్రామా చేస్తారని ఆక్షేపించారు. కేసిఆర్ నుంచి వ్యక్తిగతంగా ఏమి ఆశిస్తున్నారో జగన్ చెప్పాలని జీవీఎల్ నిలదీశారు. మీరు చేయాల్సింది చేయకుండా కేంద్రం పై నిందలు‌ వేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. నిన్న సమావేశం లో రైల్వే జోన్ అంశం అసలు చర్చకు రాలేదన్నారు. రైల్వే జోన్ విషయంలో విజయసాయి రెడ్డి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.

రాజకీయాల్లో నీచమైన వ్యాఖ్యలు చేయడం మంచి సంస్కృతి కాదని, ఇళ్లల్లో మహిళలను కూడా దూషించడాన్ని అందరూ ఖండించాలన్నారు. ఆయా పార్టీ ల నాయకులు తమ వారిని కంట్రోల్ చేయాలన్నారు. సోషల్ మీడియా లొ కూడా దూషణలు చేస్తున్నారంటే..నాయకులే ప్రోత్సహిస్తున్నారనేది అర్థం అవుతుందన్నారు. బిజెపి చేపట్టిన స్ట్రీట్ కార్నర్ సభలకు మంచి స్పందన వస్తుందని జీవీఎల్ తెలిపారు. అక్టోబర్ రెండు వరకు ఐదు వేల కన్నా ఎక్కవ సభలే నిర్వహిస్తామన్నారు. వైసిపి కి చెందిన వారితో సహా అనేక మంది పంచాయతీ నిధుల పై తమను కలుస్తున్నారన్నారు.
జగన్ దారి మళ్లించిన నిధులను ఇప్పించాలని వినతి పత్రాలు ఇచ్చారని, సమస్యలు నుంచి దృష్టి మరల్చడం‌ కోసం కొత్త వివాదాలను జగన్ ప్రభుత్వం సృష్టిస్తుందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు చొరచ చూపడం లేదని జీవీఎల్ ఆరోపించారు. వారికి వివాదాస్పద అంశాలే ముఖ్యంగా మారాయన్నారు.

English summary
bjp mp gvl narasimharao on today slams for spreading rumours on railway zone denial by central govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X