BJP MP GVL నరసింహారావు డిమాండ్ ఇదే?
ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ కంపెనీలను తరిమేయడం తప్ప కొత్త కంపెనీలను తీసుకొచ్చే ఆలోచన ఉందా? లేదా? అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు. 2024లో జగన్ ఓటమిపాలైతే అమరావతిలోనే ఉంటారని గ్యారంటీ ఏమైనా ఉందా? అని నిలదీశారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ రంగం కుదేలైందని, ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా 0.1 శాతంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐటీ ఉత్పత్తుల్లో ఏపీ కనపడటంలేదని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత లేదని మండిపడ్డారు. ఉన్నవాళ్లను తరిమేయాలనే ఆలోచన చేస్తున్నారుకానీ కొత్త కంపెనీలను తెచ్చి ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం మాత్రం చేయడంలేదని ఆరోపించారు. ఏపీకి చెందిన యువత తమ ప్రతిభతో 15 శాతం ఐటీ రంగాన్ని శాసిస్తున్నారని, ఐటీ రంగాన్ని ముందుకు ఎందుకు తీసుకువెళ్లడంలేదని ప్రశ్నించారు.

ఐటీ రంగ ఉత్పత్తుల్లో ఏపీ అధ్వాన్న స్థితిలో ఉండటంపై పార్లమెంట్‌లో జీరో అవర్‌లో తాను ప్రస్తావించానన్నారు. టీడీపీ, వైసీపీ నేతలకు అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుందని, లేదంటే హైదరాబాదే గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. నాపేరు జగన్..నేనిక్కడే ఉంటానని అన్నారని, గతంలో అమరావతి విషయంలోనూ అదే చెప్పారని గుర్తుచేశారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందన్న మాటకు జగన్ కట్టుబడి లేరు. అలాంటప్పుడు ఈ మాటకు కట్టుబడి ఉంటారనే నమ్మకం లేదన్నారు. 2024లో అధికారం చేజారిపోబోతోంది కాబట్టి అప్పుడు కూడా అమరావతిలోనే ఉంటారా? దీనిపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలంటూ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications