బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు కారు ఢీకొని మహిళ మృతి, మరొకరికి తీవ్రగాయాలు
అమరావతి: భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా కొలనుకొండ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను అదుపుతప్పిన ఎంపీ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ప్రమాదం జరిగిన సమయంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారులోనే ఉన్నారు. ప్రమాదం తర్వాత మరో కారులో విజయవాడ వెళ్లారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications