వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం వైఎస్ జగన్‌తో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి భేటీ: తిరుమల సహా కీలక అంశాలపై చర్చ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జ‌రిగిన ఈ భేటీలో టీటీడీ చైర్మన్‌ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీతోపాటు, దేశంలోని పలు అంశాల మీద చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అటు, ఏపీ రాజకీయాల మీద కూడా స్వామి ఆరా తీసినట్టు సమాచారం.

మరోవైపు, దేశంలో మైనారిటీలు గుండెమీద చేయివేసుకుని పూర్తి భరోసాగా, భధ్రంగా ఉండగలిగే రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలో షేక్ కులస్ధుల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మైనారిటీలు విద్య, ఉద్యోగావకాశాలలో వెనకబడి ఉండటాన్ని గమనించి దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించారన్నారు.

 BJP mp subramanian swamy meets ap cm ys jagan in amaravathi

వైయస్ జగన్ మొదటినుంచి మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలియచేశారు. ముఖ్యంగా మైనారిటీలు అత్యధికంగా పేదవర్గాలుగా ఉండటం గమనించి వారిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు వారి సంక్షేమానికి అనేక పథ‌కాలను జగన్ తీసుకువచ్చారని తెలిపారు. ఈ పథ‌కాలను ఆయా కుటుంబాలదరికి చేర్చాల్సిన బాధ్యత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని మైనారిటీ నేతలు, షేక్ కార్పోరేషన్ ఛైర్మన్, డైరక్టర్లపై ఉందన్నారు.

సీబీఐ కోర్టులో వైఎస్ జగన్, విజయసాయిరెడ్డికి ఊరట

సీబీఐ కోర్టులో జగన్‌కు భారీ ఊరట లభించింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసింది సీబీఐ కోర్టు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున ఆయన బెయిల్‌ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు.. జగన్‌తోపాటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలని కోరారు. బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను వేగంగా విచారించాలని కోరారు.

విచారణ జరిపిన న్యాయస్థానం రఘురామ పిటిషన్లను కొట్టివేసింది. సీబీఐ కోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు పార్లమెంటుసభ్యులు విజయ సాయిరెడ్డికి ఊరట లభించింది. సీఎం జగన్, విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఏపీ సీఎం జగన్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. రఘురామ కృష్ణంరాజు పిటీషన్‌ను తిరిస్కరిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

Recommended Video

YS Sharmila Condolence Saidabad Incident Victim Family || Oneindia Telugu

బెయిల్ మంజూరు చేసినప్పుడు సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్ ఉల్లంఘిస్తున్నారంటూ జూన్ 4న రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుతో సంబంధం లేని రఘురామ పిటిషన్ విచారణ అర్హతపై మొదట సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. రఘురామ వాదనతో ఏకీభవించిన సీబీఐ న్యాయస్థానం.. పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సైతం తిరస్కరించింది. సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కూడా బుధవారం కొట్టివేసింది.
అయితే, రఘురామ దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది.

English summary
BJP mp subramanian swamy meets ap cm ys jagan in amaravathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X