ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా మారుతుంది. జగన్ ఓటమి లక్ష్యంగా బిజెపి, టిడిపి, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. సీట్ల ఖరారులో అనూహ్య ట్విస్టులు చోటుచేసుకున్నాయి. కూటమి ఏర్పాటు లో కీలకంగా వ్యవహరించిన రఘురామరాజు సీటు దక్కలేదు. దీంతో, రఘురామ అసహనానికి గురయ్యారు. ఈ సమయంలోనే నరసాపురం బిజెపి ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ వీడియో ను బిజెపి శ్రేణులు వైరల్ చేస్తున్నారు.
నర్సాపురం సీటు వెనుక
వైసిపి ఎంపీగా గెలిచిన కొద్ది నెలలకే రఘురామరాజు జగన్ నాయకత్వం తో విభేదించారు. ఢిల్లీ కేంద్రంగా దాదాపు నాలుగేళ్ల కాలంగా జగన్ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నారు. రఘురామపైన ఏపీ ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేసింది. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు రఘురామ దగ్గరయ్యారు. ఎన్డీఏ కూటమిగా మూడు పార్టీలు ఏపీలో కలవడంలో తన వంతు పాత్ర పోషించారు. కొద్దిరోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన రఘురామ ఈ ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. పొత్తు చర్చల్లో భాగంగా నరసాపురం బిజెపికి కేటాయించారు. దీంతో రఘురామ బిజెపి నుంచి పోటీ చేస్తారని చర్చ జరిగింది. కానీ, అనూహ్యంగా రఘురామకు సీటు దక్కలేదు.

శ్రీనివాసవర్మ భావోద్వేగం
దీనికి బిజెపి నేతలు పలు కారణాలను విశ్లేషించారు. కానీ రఘురామ మాత్రం తనకు నరసాపురం నుంచి ఎంపీ సీటు ఇప్పించాల్సిన బాధ్యత చంద్రబాబు పైనే ఉందని తేల్చి చెప్పారు. నరసాపురం నుంచి బిజెపిలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న పార్టీ నేత భూపతిరాజు శ్రీనివాస వర్మకు బిజెపి సీటు కేటాయించింది. దాదాపుగా 30 ఏళ్లుగా శ్రీనివాస వర్మ బిజెపిలో పనిచేస్తున్నారు. ఆయనను కాదని ఇంకా పార్టీలో చేరని రఘురామకు సీటు ఎలా ఇస్తామని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో పార్టీలో చేరటం అనేది సమస్య కాదని రఘురామ వాదన. అయితే ఇప్పటికే సీటు ఖరారు కావడంతో ఇక రఘురామ ఎన్నికల్లో పోటీ చేయటం పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
కమలం పార్టీ గుర్తుని హత్తుకుని భావోద్వేగానికి లోనైనా బిజెపి పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస వర్మ..!! pic.twitter.com/5bREiEtUhM
— oneindiatelugu (@oneindiatelugu) March 28, 2024
పార్టీలో 30 సంవత్సరాలుగా
ఇదే సమయంలో బిజెపి నరసాపురం అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ భావోద్వేగానికి గురైన వీడియో బిజెపి శ్రేణుల్లో వైరల్ అవుతుంది. తనకు టిక్కెట్ దక్కినందుకు శ్రీనివాస్ వర్మ ఎమోషనల్ అయ్యారు. మూడు దశాబ్దాల కష్టానికి గుర్తింపు దక్కిందని ఉద్వేగానికి లోనయ్యారు. బిజెపి కార్యాలయం వద్ద ఉన్న కమలం గుర్తుపై పడుకుని ప్రణామం చేశారు. కమలం గుర్తుపై పడి కాసేపు అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత అభిమానులు కార్యకర్తలు ఆయనను బలవంతంగా లేపాల్సి వచ్చింది. పార్టీ పైన ఆయనకున్న కమిట్మెంట్ చూసిన కార్యకర్తలు పార్టీకి శ్రీనివాస్ వర్మకు మద్దతుగా నినాదాలు చేశారు. మూడు దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకున్నందుకే శ్రీనివాస్ వర్మ కు సీటు దక్కిందని బిజెపి నేతలు ఈ వీడియో ద్వారా వివరిస్తున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications