Kanna Lakshminarayana : జనసేనలోకి కన్నా లక్ష్మీనారాయణ ? బీజేపీ క్లారిటీ ఇదే ..
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, పార్టీలో కీలక నేతగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరుతున్నట్లు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో విభేదాల నేపథ్యంలో ఆయన బీజేపీని వీడి జనసేన గూటికి చేరబోతున్నట్లు ఆ వార్తల సారాంశం. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజు కన్నా బీజేపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరడం ఖాయమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బీజేపీ నుంచి జనసేనలోకి కన్నా లక్ష్మీనారాయణ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ ఇవాళ స్పందించింది. పార్టీ నేత తురగా నాగభూషణం ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. కన్నా బీజేపీని వీడి జనసేనలోకి చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈరోజు వివిధ ఛానెల్స్, వివిధ మాధ్యమాల్లో కన్నా గారిపై వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన వెల్లడించారు. అయన వ్యక్తిగత కార్యక్రమాల దృష్ట్యా హైదరాబాద్ లో ఉన్నారన్నారు.
26న జనసేన లో చేరుతారు అని ప్రసార సాధనాల్లో వాస్తున్న వార్తలు అవాస్తవమని నాగభూషణం తెలిపారు.

భీమవరంలో జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీకి కన్నా లక్ష్మీనారాయణ రాకపోవడంతో జనసేనలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపైనా తురగా స్పందించారు. వ్యతిగత పనుల వల్లే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కాలేకపోతున్నారు అన్నది వాస్తవమన్నారు. పైన తెలిపిన అంశాలు కన్నా లక్ష్మీనారాయణ గారిపై వస్తున్న వార్తలకు ఖండనగా భావించాలని నాగభూషణం కోరారు. దీంతో కన్నా పార్టీ ఫిరాయింపు ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతోందేమో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications