బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఆర్ కృష్ణయ్య-ముగ్గురితో జాబితా విడుదల..!
త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ముగ్గురు అభ్యర్ధుల జాబితాను బీజేపీ ఇవాళ విడుదల చేసింది. ఇందులో వైసీపీ మాజీ ఎంపీ, బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు ఏపీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. అలాగే హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిషా నుంచి సుజీత్ కుమార్ ను అభ్యర్ధులుగా ఎంపిక చేశారు. వీరు త్వరలో రాజ్యసభకు జరిగే ఉపఎన్నికల్లో ఆయా రాష్ట్రాల నుంచి పోటీ చేయబోతున్నారు.
వాస్తవానికి ఏపీలో వైసీపీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య ఈ మధ్యే ఆ పార్టీకి, తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వీరి రాజీనామాల్ని రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి నుంచి ముగ్గురు అభ్యర్ధుల్ని గెలిపించుకునే అవకాశం ఉండటంతో ఆర్ కృష్ణయ్యకు బీజేపీ నుంచి అవకాశం కల్పించారు. అలాగే మిగిలిన రెండు సీట్లకు టీడీపీ అభ్యర్ధుల్ని నిలబెట్టబోతోంది.

వైసీపీకి, ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన ముగ్గురు నేతల్లో ఆర్ కృష్ణయ్యకు బీజేపీ తిరిగి అవకాశం కల్పిస్తుండగా.. బీద మస్తాన్ రావుకు టీడీపీ అవకాశం ఇస్తోంది. మూడో సీటుకు మాత్రం మోపిదేవి వెంకటరమణకు బదులుగా సానా సతీష్ కు అవకాశ దక్కనుంది. ఇవాళ వీరిద్దరి పేర్లను టీడీపీ ప్రకటించబోతోంది. అనంతరం రేపు వీరు ఎంపీ అభ్యర్ధులుగా నామినేషన్ దాఖలు చేస్తారు. రేపటితో రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధుల నామినేషన్ల గడువు ముగియనుంది.












Click it and Unblock the Notifications