వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపితో పొత్తును కాలమే నిర్ణయిస్తోంది: బిజెపి

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టిడిపి, బిజెపి పొత్తును కాలమే నిర్ణయిస్తోందని బిజెపి అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల ప్రకటించారు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ చేస్తున్న రాద్ధాంతం ఒకప్పుడు పదవుల కోసం హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించి అశాంతి రగిల్చే తరహాలో కనిపిస్తోందని ఆరోపించారు.

Recommended Video

Is Modi Fearing Chandrababu's Strategy ?

సోమవారం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో సుధీష్‌‌రాంబొట్ల మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో కొన్ని పార్టీలు ఉనికి కోసం కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 2013లో సమైక్య ఉద్యమం తరహాలో ఇప్పుడు మరో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా నడుస్తోందని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

Bjp spokesperson Sudhish Rambhotla slams on Ysrcp

అటువంటి పార్టీల ట్రాప్‌లో తమ మిత్రపక్షమైన టీడీపీ కూడా పడిందని సుధీష్ రాంబొట్ల అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీల ట్రాప్‌ నుండి టిడిపి బయటపడాలని సుధీష్ రాంబొట్ల కోరారు.

మిత్రపక్షంగా కేంద్రాన్ని అడిగే హక్కు రాష్ట్రానికి ఉంటుందని, రాష్ట్రానికి కేంద్రం ఇప్పటి వరకూ ఏమేమి ఇచ్చిందో, ఇంకా ఏమివ్వబోతోందో వివరించేందుకు తమ పార్టీ అధ్యక్షుడు హరిబాబు సిద్ధంగా ఉన్నారన్నారు.

English summary
Bjp Andhra pradesh spokes person Sudeesh Rambotla made allegations on Ysrcp on Monday. he spoke to media at vijayawada
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X