చంద్రబాబు ఆర్దిక మూలాలాను లాగేసారు: జగన్ పొర్లు దండాలు పెట్టినా: అపరేషన్‌లో నెక్స్ట్ స్టెప్..!
సరే..ఆ నలుగురు బీజేపీలో చేరారు. వ్యక్తిగత అవసరాలో..లేక..రాజకీయ భవిష్యత్ కోసమో. మరి..ఇప్పుడు వారిలో ముగ్గురు ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ నుండి రాజ్యసభ సభ్యులైనా..ఇక నుండి వారి బీజేపీ సభ్యులే. మరి వారు ఏపీలో బీజేపీ కోసం ఎవరితో పోరాటం చేస్తారు. వారి లక్ష్యం టీడీపీనాద..లేక వైసీపీనా. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు నడుపుతున్నారు. అలాగని..ముఖ్యమంత్రి జగన్ తో సానుకూలంగా వ్యవహరిస్తారా..ఇప్పటికే జగన్‌కు వ్యతిరేకంగా వాయిస్ మొదలు పెట్టారు. భవిష్యత్‌లో వారికి అప్పగించిన బాధ్యతలు ఏంటి..ఏం చేయబోతున్నారు..

చంద్రబాబు ఆర్దిక మూలాలకే దెబ్బ..
టీడీపీ అధినేత ఆర్దికంగా వెన్ను దన్నుగా నిలిచే వ్యక్తులను బీజేపీ ఏరి కోరుకుంది. వారిలో ప్రధానంగా చంద్రబాబుకు తొలి నుండి ఆర్దికంగా అండగా నిలిచిన సుజనా చౌదరి..సీఎం రమేష్..గరికపాటి మోహన రావు..ఈ మధ్య కాలంలో టీజీ వేంకటేష్ ముందు వరుసలో ఉంటారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా..పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ఆర్దిక వనరులను సమ కూర్చటం..పార్టీకి ఆర్దికంగా తోడ్పాటు అందించే వారిని సమీకరించటం వీరి విధి. అదే సమయంలో చంద్రబాబు తరపున ఢిల్లీలో... విదేశాల్లో పనులు చక్కబెట్టేవారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఆర్దిక నిర్వహణ వ్యవస్థకు కేంద్రం కొంత మేర బ్రేకులు వేసింది. ఇక, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఆర్దిక కష్టాలు ఉంటాయి. ఇదే విధంగా త్వరలో స్థానిక ..మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. సరిగ్గా ఇక చంద్రబాబు కోలుకోలేని విధంగా ఆయన ఆర్దిక మూల స్థంభాలను కూల్చేసారు.
Recommended Video


వారి రాజకీయ లక్ష్యం ఎవరు..
ఇప్పుడు టీడీపీ నుండి బీజేపీలో చేరిన నలుగురు ఎంపీల్లో ముగ్గురు ఏపీకి చెందిన వారే. అందునా జగన్ వ్యతిరేకులు.
సుజనా చౌదరి..సీఎం రమేష్ బీజేపీలో ఉన్న వారు చంద్రాబు మీద రాకీయంగా దాడి చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు టీడీపీ నేతలు వారు పార్టీ మారటం పైన విమర్శలు చేస్తున్నా..అవి ఒకటి రెండు రోజుల్లో సర్దుకుంటాయి. మరి..సుజనా ఏపీ సీఎం జగన్ మీద కొంత సానుకూల వైఖరితో ఉన్నారు. ఇక, సీఎం రమేష్ మాత్రం తన సొంత జిల్లాకే చెందిన జగన్ పైన తొలి నుండి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇప్పుడు సైతం ఆయనకు ఏపీలో గత ప్రభుత్వం ద్వారా వచ్చిన కాంట్రాక్టులు పోకుండా బీజేపీ ద్వారా జగన్ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తారని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో రాజకీయంగా బలంగా ఉన్న జగన్ ను ఇప్పటికిప్పుడు లక్ష్యంగా చేసుకొనే అవకాశాలు లేవు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో సైతం సంప్రదింపులు ఈ నేతలు మొదలు పెట్టారు.

జగన్ పొర్లు దండాలు పెట్టినా..
టీడీపీ నుండి బీజేపీలో చేరిన నేతలు..అదే విధంగా బీజేపీతో టచ్‌లో ఉన్న నేతలు సైతం జగన్‌ను దెబ్బ కొట్టే ఎత్తుగడలు ప్రారంభించారు. జగన్ తాను ఎన్నికల్లో గెలిచిన సమయం నుండి ప్రత్యేక హోదా మీదే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రధానితో కలిసిన ప్రతీ సందర్భంలోనూ అదే అంశం ప్రస్తావిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో బీజేపీలో చేరిన సుజనా చౌదరి..కేశినేని లాంటి వారు ఏపీకీ ప్రత్యేక హోదా వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. జగన్ ప్రధానికి దండాలు కాదు..పొర్లు దండాలు పెట్టినా హోదా రాదని స్పష్టం చేస్తున్నారు. దీంతో..ఇక జగన్ కేంద్ర సాయం గురించి మాట్లాడిన ప్రతీ సారి బీజేపీ వాయిస్ వినిపించేందుకు వీరి సిద్దంగా ఉంటారని అర్దం అవుతోంది. అయితే, వీరు టీడీపీని ఎంత వరకు లక్ష్యంగా చేసుకుంటారనేది మాత్రం ఆసక్తి కరమే.












Click it and Unblock the Notifications