బీజేపీ-టీడీపీ స్నేహం కొనసాగదు, అందుకే మోడీ శత్రువు బాబు: జేసీ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: టిడిపి సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం నాడు టిడిపి - బీజేపీ మైత్రి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల మైత్రి మరెంతో కాలం కొనసాగదని మాట్లాడి, రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు.

ప్రత్యేక హోదా పైన ఇప్పటికే కేంద్రం ఓ ప్రకటన చేసిందని, ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచించి, తెలివిగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆయన తీసుకునే ఓ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.

అయితే, తమ రెండు పార్టీల బంధం మరెంతో కాలం కొనసాగదని అభిప్రాయపడ్డారు. బీజేపీతో మైత్రి బంధం తెంచుకోవాలని తాను చంద్రబాబుకు ఏడాది క్రితమే చెప్పానని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలదే హవా అని చెప్పారుత.

Also Read: జగన్ బంద్: మోడీ! ఎందుకిలా చేస్తున్నారో.. బాబు, ఎత్తుకుపైఎత్తు

BJP-TDP alliance will end soon: JC

బాబును మోడీ శత్రువుగా భావిస్తున్నారు

ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబును ప్రధాని మోడీ తన శత్రువుగా భావిస్తున్నారని మరో సంచలన కామెంట్ చేశారు. చంద్రబాబు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లు రాజకీయాలను ప్రభావితం చేయగలవారన్నారు.

చంద్రబాబు అనుభవం ఉన్న వ్యక్తి అని, ఆయనకు అన్నీ తెలుసునని ప్రధాని మోడీకి తెలుసునని, అందుకే ఆయనకు ఏపీ సీఎం ప్రధాన శత్రువు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తలుచుకుంటే ప్రత్యేక హోదా పెద్ద సమస్య కాదన్నారు. చంద్రబాబు సూచనల మేరకు పార్లమెంటులో వ్యవహరిస్తామని చెప్పారు.

Also Read: జైట్లీ వ్యాఖ్యలతో బాధపడ్డ బాబు, మోడీకి జపాన్ తరహా నిరసన

చంద్రబాబును ఎలాగైనా అణగదొక్కాలని బీజేపీ నేతలు చూస్తున్నారని అన్నారు. హోదా ఇవ్వడానికి ఏం రూల్స్ అడ్డు వస్తున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని ఇవ్వాలనుకుంటే రూ ల్స్ అడ్డుపడవన్నారు. చంద్రబాబు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకోగలరన్నారు.

ఈ పరిస్థితులో బీజేపీతో కలిసి వెళ్లడం సరైనది కాదని, కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా బీజేపీతో బంధం తెంచుకొని ఎన్నికలకు వెళ్తే బాగుంటుందన్నారు. జగన్ బంద్‌కు పిలుపునివ్వడం పైనా జేసీ స్పందించారు. బందులు చేస్తే సామాన్య ప్రజలు నష్టపోతారే తప్ప, కేంద్రంలో ఉన్న వాళ్లకు సూదిగుచ్చినట్లు కూడా ఉండదన్నారు. జనానికి ఇబ్బందులు లేకుండా బంద్ పాటించాలన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anantapur TDP MP JC Diwakar Reddy on Sunday said that BJP-TDP alliance will end soon.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి