హోదా: బిజెపి, టిడిపి ఎంపీల భేటీ, కింకర్తవ్యం?

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కాంగ్రెసు పార్టీ ఆందోళనలతో ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన బిజెపి, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులపై ఒత్తిడి పెరిగినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారు బుధవారం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణకు రూపకల్పన చేశారు. ఎపికి ప్రత్యేక ఇవ్వాల్సిందేనంటూ దానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని టిడిపికి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపి తోట నరసింహం అన్నారు

ప్రత్యేక హోదా కోసం కేంద్రం పెద్దలపై ఒత్తిడి పెడుతామని బిజెపి విశాఖపట్నం పార్లెమంటు సభ్యుడు హరిబాబు కూడా అన్నారు. ఎపికి ఇచ్చిన హామీలపై ప్రధానిని, హోం, ఆర్థిక శాఖల మంత్రులన కలుస్తామని ఆయన చెప్పారు. బడ్జెట్‌కు ముందే విభజన హామీలపై కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని బిజెపి, టిడిపి పార్లమెంటు సభ్యులు అనుకున్నారు.

BJP and TDP MPs to put pressure for special status to AM

రేపు ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌లో విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్‌ వస్తుందని ఆశిస్తున్నానని కేంద్రమంత్రి సుజనాచౌదరి అన్నారు. టీడీపీపీ సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ 14వ ఆర్థికసంఘం వల్ల ప్రత్యేకంగా ఏపీకి వచ్చే లాభమేమీ లేదన్నారు. విభజన హామీలను త్వరగా అమలు చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన చెప్పారు.

రాష్ట్రాలకు అధికంగా నిధులు ఇవ్వడం ఆర్థికవిధానంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, దీనివల్ల దేశాభివృద్ధి సాధ్యమవుతుందని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారు. విభజన హామీలు నెరవేర్చి బీజేపీ ప్రభుత్వం ఏపీకి న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఎంపీ హరిబాబు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+