వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీపై ఈగ వాలనివ్వరా, బీజేపీ చెప్పలేదని పవన్ కళ్యాణ్ అంటారా: బాబు షాకింగ్

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీపై చేసిన ఆరోపణలు అన్ని కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికలో వచ్చినవేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

ఆయన నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ, జనసేనలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీపై జగన్, పవన్‌లు ఈగ వాలనివ్వడం లేదన్నారు. అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని, మనం ఇదే విధంగా ముందుకెళ్లాలన్నారు.

ఎందుకు చెప్పట్లేదో, కేసులన్నీ బయటపెట్టు: జగన్ ఛార్జీషీట్ల విలువపై ఉండవల్లి షాకింగ్ఎందుకు చెప్పట్లేదో, కేసులన్నీ బయటపెట్టు: జగన్ ఛార్జీషీట్ల విలువపై ఉండవల్లి షాకింగ్

ఆ ముగ్గురు ఒక్కటే

ఆ ముగ్గురు ఒక్కటే

ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదారి పట్టించి, మనపై బురద జల్లడమే వారి ఉద్దేశ్యమని, ఆ మూడు పార్టీలు ఒక్కటేనని, ఒకే అజెండా కోసం పని చేస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మనం ఇలాగే ముందుకెళ్లాలని, అప్పుడు బీజేపీ, జనసేన, వైసీపీలను ప్రజలు నిలదీస్తారన్నారు.

కీలక సమయంలో పవన్ ఎందుకిలా

కీలక సమయంలో పవన్ ఎందుకిలా

చంద్రబాబు పాలన పట్ల ఎవరూ సంతృప్తిగా లేరని, మోడీ పట్ల సంతృప్తిగా ఉన్నారని జగన్ చెబుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మనం యుద్ధం చేయడం లేదని, ధర్మం కోసం పోరాడుతున్నామని చెప్పారు. కీలక సమయంలో పవన్ ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హోదా గురించి మోడీ చెప్పలేదు, యూపీఏ చెప్పిందని

హోదా గురించి మోడీ చెప్పలేదు, యూపీఏ చెప్పిందని

పవన్ కళ్యాణ్‌తో ఎవరు ఆరోపణలు చేయిస్తున్నారని చంద్రబాబు అన్నారు. హోదా గురించి మోడీ మాట్లాడలేదని, యూపీఏ చెప్పిందని పవన్ అనడం వెనుక అర్థం ఏమిటని వ్యాఖ్యానించారు. మూడు పార్టీల స్క్రిప్ట్ ఒక్కటేనని, గతంలో సాక్షిలో వచ్చినవే ఇప్పుడు పవన్ అంటున్నారని, అప్పుడు జగన్ పత్రికల్లో వచ్చినప్పుడే ప్రజలు తిరస్కరించారన్నారు.

 ఆ ముగ్గురి కుట్రను ఇలా ప్రచారం చేయండి

ఆ ముగ్గురి కుట్రను ఇలా ప్రచారం చేయండి


విజయ సాయి రెడ్డి కేంద్ర పెద్దల్ని పదేపదే కలవడం, ప్రధాని కార్యాలయంలో తిష్ట వేయడాన్ని బట్టే లాలూచీ రాజకీయాలు తెలిసిపోతున్నాయని చంద్రబాబు అన్నారు. బీజేపీ, వైసీపీ, జనసేన కుట్ర రాజకీయాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని, ఇందుకు సైకిల్, బైక్ ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఇంటింటికి కరపత్రాలు పంచాలని, ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలన్నారు. తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు అలా చెప్పడం సరికాదు

చంద్రబాబు అలా చెప్పడం సరికాదు

ఇదిలా ఉండగా, జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని చంద్రబాబు చెప్పడం సరైనది కాదని, అవసరమైతే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని చెప్పడం సముచితంగా ఉంటుందని ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు అన్నారు.

English summary
Asserting that he is fighting for the rights of Andhra Pradesh, Chief Minister Chandrababu Naidu on Monday alleged that the BJP is trying to suppress his voice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X