వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిజైన్ చేయండి!: బాబుపై విష్ణు సంచలనం, జగన్‌తో మొదలు, తెరవెనుక పవన్ కళ్యాణ్!!

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 2019 ఎన్నికలకు ముందు రాజకీయాలు ఎటు నుంచి ఎటు తిరుగుతాయో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో మరో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.

పవన్ కళ్యాణ్ ఏమిటో నాకే తెలుసు, చెబితే వినట్లేదు: మహేష్ కత్తి ఆసక్తికరంపవన్ కళ్యాణ్ ఏమిటో నాకే తెలుసు, చెబితే వినట్లేదు: మహేష్ కత్తి ఆసక్తికరం

ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలను బట్టి రాజకీయాలు ఎటువైపు తీరుగుతాయోననే ఉత్కంఠ నెలకొంది.

అభిమానులకు శుభవార్త!: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం? గందరగోళానికి చెక్అభిమానులకు శుభవార్త!: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం? గందరగోళానికి చెక్

వైసీపీ నుంచి వచ్చి మంత్రి పదవులా

వైసీపీ నుంచి వచ్చి మంత్రి పదవులా

బుగ్గనతో కలిపి మాట్లాడిన విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ తర్వాత టీడీపీలో ఇప్పుడు మంత్రులుగా కొనసాగడం సరికాదని వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి వచ్చి పదవులు అనుభవిస్తున్న వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Recommended Video

బీజేపీతో కలిసినడుస్తాం, కానీ ఒక కండిషన్ !
 పార్టీ మారిన వారు మంత్రులు కావొచ్చని చట్టం తీసుకురండి

పార్టీ మారిన వారు మంత్రులు కావొచ్చని చట్టం తీసుకురండి

అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, అమర్నాథ్ రెడ్డిలు వైసీపీ నుంచి గెలిచి ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. వీరంతా రాజీనామా చేయాలని విష్ణు కుమార్ రాజు అభిప్రాయపడ్డారు. వీరంతా మంత్రులుగా కొనసాగడం అనైతికం అన్నారు. లేదంటే పార్టీ ఫిరాయించిన వారు మంత్రులుగా కావొచ్చని ఓ కొత్త చట్టం తేవాలని చంద్రబాబుపై సెటైర్ వేశారు.

 మొదలు పెట్టిన జగన్, ఇప్పుడు కీలక పరిణామం

మొదలు పెట్టిన జగన్, ఇప్పుడు కీలక పరిణామం

బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే వచ్చే ఎన్నికల్లో తాము ఆ పార్టీతో కలుస్తామని ఇటీవల వైయస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విష్ణు కుమార్ రాజు వైసీపీ నాయకుల ముందు చంద్రబాబుకు షాకిచ్చే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జగన్ మాట్లాడిన అంశంపై హాట్ హాట్‌గా చర్చ సాగుతుండగా ఇది చోటు చేసుకోవడం కీలక పరిణామంగా చెబుతున్నారు.

తెరవెనుక ఏ జరుగుతోంది

తెరవెనుక ఏ జరుగుతోంది

జగన్ పొత్తు వ్యాఖ్యలు, ఇప్పుడు విష్ణు వ్యాఖ్యలు చూస్తుంటే తెరవెనుక ఏం జరుగుతోందనే చర్చ సాగుతోంది. టీడీపీ పట్ల బీజేపీ అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీ నేతలు సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు టీడీపీకి దూరం జరగాలని బీజేపీ పెద్దలకు ఎప్పటికప్పుడు చెబుతున్నారని తెలుస్తోంది.

 విష్ణు కుమారే అలా అన్నారంటే

విష్ణు కుమారే అలా అన్నారంటే

పరిణామాలను చూస్తుంటే లోలోన ఏదో జరుగుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకు మరో బలమైన కారణం కూడా ఉందని అంటున్నారు. బీజేపీలో విష్ణు కుమార్ రాజు టీడీపీ అనుకూలురుగా ముద్రపడ్డారు. అలాంటి నేత ఇప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఏదో జరుగుతోందనే చర్చ సాగుతోంది.

 ఏపీలో పెనుమార్పులకు అవకాశం

ఏపీలో పెనుమార్పులకు అవకాశం

ఇప్పటికే గత కొంతకాలంగా ఏపీలో పొత్తు అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఏ పార్టీ ఏ పార్టీతో వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం బీజేపీ తీరుతో టీడీపీ బయటకు చెప్పుకోలేని విధంగా ఉందని అంటున్నారు. వరుస పరిణామాలను గమనిస్తే.. ఏపీలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

 పవన్ కళ్యాణ్ వల్లేనా

పవన్ కళ్యాణ్ వల్లేనా

నవ్యాంధ్రకు కేంద్రం అవసరం దృష్ట్యా బీజేపీతో సఖ్యతతో ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఏపీ హామీల విషయంలో వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉన్నందున చంద్రబాబుకు.. బీజేపీ కంటే పవన్ ఆవశ్యకతనే ఎక్కువగా ఉందని అంటున్నారు. చంద్రబాబు వ్యూహాన్ని గమనించి బీజేపీ కూడా టీడీపీకి జరిగే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే ప్రత్యేక హోదా ఇస్తేనే బీజేపీతో కలుస్తానని జగన్ చెప్పారు. కాబట్టి ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడిందని అంటున్నారు.

English summary
BJP Vishnu Kumar Raju has demanded to resign ministers who join Telugu Desam Party from YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X