BJP పెద్దల వ్యూహం... పిచ్చెక్కిపోవాల్సిందే!

మోడీ, అమిత్ షా కు కూడా కొరుకుడు పడని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా నియమితులైన తర్వాత భారతీయ జనతాపార్టీ రూపురేఖలే మారిపోయాయి. సాధ్యమైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం సాధించింది. వరుసగా రెండుసార్లు ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. వ్యూహ ప్రతివ్యూహాలు, ప్రత్యర్థి పార్టీల బలహీనతలు, వారి బలాన్ని దెబ్బతీయడం.. తదితర అంశాలతో పైచేయి సాధించి రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగింది.

మోడీషాకు కొరుకుడు పడని ఏపీ

మోడీషాకు కొరుకుడు పడని ఏపీ

మోడీ, అమిత్ షా కు కూడా కొరుకుడు పడని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కనీసం ఒక్కశాతం ఓటింగ్ కూడా లేనంత దీనస్థితిలో ఉంది. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ తర్వాత అది వికటించింది. పొరుగున తెలంగాణలో అధికారంలోకి రావడానికి విశ్వప్రయత్నం చేస్తోన్న బీజేపీ తెలంగాణలో అధికారం దక్కితే ఏపీలో కూడా సులువుగా దక్కించుకోవచ్చనే భావనలో ఉంది. అందుకు తగ్గ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. మాజీ ఐవైఆర్ కృష్ణారావు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజల సమస్యలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి మార్గాలు కూడా రూపొందించడం ఈ కమిటీ పని.

 బీజేపీ వైఖరిపై ఉత్కంఠ?

బీజేపీ వైఖరిపై ఉత్కంఠ?


వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేయబోతున్న తరుణంలో బీజేపీ వైఖరి ఎలా ఉండబోతోంది? అనేది ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇటీవలే విశాఖలో తనను కలిసి వపన్ కల్యాణ్ తో ప్రధానమంత్రి ఎన్నికలు ఆరునెలలు ఉన్నాయనగా పొత్తుల గురించి అప్పుడు ఆలోచించవచ్చని చెప్పినట్లు సమాచారం. అయితే తెలుగుదేశం, జనసేన అధినేతలు ఇప్పటికే రెండుసార్లు కలిసి చర్చించారు. పొత్తు ఖాయమని, ఏయే నియోజకవర్గాలను జనసేనకు కేటాయించాలనేదే మిగిలివుందని టీడీపీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపాయి.

లింగాయత్ లను ఆకర్షించడం ద్వారా..

లింగాయత్ లను ఆకర్షించడం ద్వారా..


కర్ణాటకలో అధికారంలోకి రావడానికి లింగాయత్ సామాజికవర్గాన్ని దరి చేర్చుకుంది. 19 శాతానికి పైగా ఉన్న లింగాయత్ లను ఆకర్షించడంద్వారా ఆ పార్టీ అక్కడ విజయం సాధించగలిగింది. సామాజికవర్గాల అండతో ఏపీలో కూడా బలపడాలనేది బీజేపీ వ్యూహం. 23 శాతం వరకు ఉన్న కాపులను పునాదిగా చేసుకుంటే కర్ణాటక తరహాలోనే అధికారంలోకి రావచ్చని అంచనా వేస్తున్నారు ఆ పార్టీ పెద్దలు. వారి వ్యూహంలో భాగంగానే కాపులపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రకటనలని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వేదిక ఏదైనా కాపులకు సంబంధించి ప్రకటనలు చేయడానికి మాత్రం ఆయన వెనకాడటంలేదు. బీజేపీ పెద్దల వ్యూహంలో భాగంగానే ఈ ప్రకటనలుంటున్నాయని భావిస్తున్నారు. వారి ప్రయత్నం ఎంతమేరకు విజయవంతమవుతుందో వేచిచూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+