ఎన్నికల వేళ వైసీపీ, బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు ? సీబీఐ దూకుడు ! పార్లమెంట్ లో కేంద్రం షాకులు?

ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ, బీజేపీ నాలుగేళ్ల తమ స్నేహాన్ని పక్కనబెట్టి పలు అంశాల్లో పరస్పరం టార్గెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరి తాజా ఎత్తుగడలే ఇందుకు నిదర్శనం.

2019లో కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఏపీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన వైసీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. దీనికి కారణం వైసీపీకి ప్రత్యర్ధి అయిన చంద్రబాబుతో అప్పట్లో నెలకొన్న తీవ్ర విభేదాలే. అయితే నాలుగేళ్లుగా కొనసాగుతున్న వీరిద్దరి స్నేహం ఎన్నికల ముందు విరోధంగా మారబోతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా సీబీఐ కేసుల్లో పెరిగిన దూకుడు, పార్లమెంటులో వైసీపీ ప్రశ్నల పరంపర, అమరావతి రాజధానిపై కేంద్రం క్లారిటీ చూస్తుంటే ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ, బీజేపీకి చెడిందా?

వైసీపీ, బీజేపీకి చెడిందా?

ఏపీలో నాలుగేళ్లుగా స్నేహం కొనసాగిస్తున్న వైసీపీ, బీజేపీ మధ్య చెడినట్లే కనిపిస్తోంది. ఇన్నాళ్లూ తన అవసరాలతో పాటు రాష్ట్ర అవసరాల కోసం కేంద్రంతో స్నేహం కొనసాగించిన సీఎం జగన్.. ఇప్పుడు దానికి కటీఫ్ చెప్పేస్తారా అన్న చర్చ నడుస్తోంది. దీనికి కారణం సీబీఐ కేసుల్లో పెరిగిన దూకుడుతో పాటు రాజధానులపై కేంద్రం నుంచి కరువైన సహకారమే అన్న చర్చ సాగుతోంది.

అంతే కాదు కేంద్రంపై తాను కూడా అదే స్ధాయిలో దూకుడు ప్రదర్శించేందుకు జగన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటులో వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని ఇరుకునపెడుతున్న తీరు చూస్తుంటే జరగబోయే పరిణామాలకు సంకేతంగా కనిపిస్తోంది.

సీబీఐ కేసుల్లో పెరిగిన దూకుడు

సీబీఐ కేసుల్లో పెరిగిన దూకుడు

రాష్ట్రంలో నాలుగేళ్ల క్రితం చోటు చేసుకున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. అదే సమయంలో జగన్ కేసుల్లోనూ సీబీఐ దర్యాప్తు సాగుతోంది. వివేకా కేసులో జగన్ సోదరుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ.. ఆ తర్వాత జగన్ ఓఎస్డీ, ఆయన భార్య భారతి సహాయకుడు నవీన్ ను కూడా విచారించింది.

దీంతో పాటు హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణకు నిందితులకు సమన్లు కూడా పంపింది. దీంతో వివేకా కేసు త్వరలో తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జగన్ కేసుల్లోనూ విచారణ వేగంగా సాగుతోంది. ఎన్నికలకు ముందు ఈ కేసుల్లోనూ సీబీఐ, ఈడీ కోర్టులు తమ తీర్పులు వెలువరించేందుకు సిద్ధమవుతున్నాయి.

పార్లమెంటులో కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న వైసీపీ?

పార్లమెంటులో కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న వైసీపీ?

దీంతో విభజన హామీలపై పార్లమెంటులో వైసీపీ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. టీడీపీ ఎంపీలతో సమానంగా వైసీపీ ఎంపీలు కూడా ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాల్లో కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా మూడు రాజధానుల వ్యవహారంలో సహకారం అందించని కేంద్రాన్ని పార్లమెంట్ వేదికగా టార్గెట్ చేసేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారు.

ఇదే క్రమంలో కోర్టులపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో వివాదాస్పదం అయ్యాయి. దీంతో కేంద్రంపై వైసీపీ ఒత్తిడి పెరుగుతోంది. ఇన్నాళ్లు కేంద్రానికి పలు అంశాల్లో మద్దతిచ్చిన వైసీపీ ఇప్పుడు ఇలా టార్గెట్ చేస్తుండటంతో బీజేపీ నేతలు వరుసగా వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టేశారు.

అమరావతిపై క్లారిటీతో కౌంటర్?

అమరావతిపై క్లారిటీతో కౌంటర్?

తాజాగా మూడు రాజధానుల విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం.. అమరావతే రాజధాని అంటూ సమాధానం ఇచ్చింది. అంతే కాదు మూడు రాజధానుల నిర్ణయం మమ్మల్ని అడిగి తీసుకోలేదంటూ కౌంటర్ ఇచ్చింది.

అంతటితో ఆగకుండా మీ రాజధానుల చట్టాలతో మాకు సంబంధం లేదంటూ తేల్చిచెప్పేసింది. దీంతో వైసీపీకి ఏం చెప్పాలో తెలియని పరిస్దితి. ఇన్నాళ్లూ కోర్టుల్లో సహకారం లేకపోయినా కేంద్రం నుంచి లభిస్తున్న అండతో దూకుడుగా ముందుకెళ్లిన వైసీపీ ఇప్పుడు కేంద్రం యూటర్న్ తో ఇరుకున పడింది. గతంలో రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమేనంటూ హైకోర్టులో అఫిడవిట్ చేసిన కేంద్రం.. ఇప్పుడు మీ రాజధానులతో మాకు సంబంధం లేదు, విభజన చట్టం ప్రకారం అమరావతే రాజధాని అని చెప్పేయడంతో ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో కేంద్రం ఇచ్చే అఫిడవిట్ పైనా అనుమానాలు మొదలయ్యాయి.

ఇప్పటికే బీజేపీ అమరావతే రాజధాని అంటూ రాష్ట్రంలో ప్రచారం చేస్తోంది. ఇప్పుడు కేంద్రం కూడా యూటర్న్ తీసుకోవడంతో వైసీపీ తదుపరి కార్యాచరణ ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+