రాజధాని అమరావతి పంట పొలాల్లో అర్ధరాత్రి క్షుద్ర పూజలు..!

Subscribe to Oneindia Telugu

గుంటూరు: మూఢ నమ్మకాలను నమ్మొద్దని ప్రభుత్వాలే పెద్దెత్తున ప్రచారం చేస్తున్నా... కొందరు అమాయకపు ప్రజలు మూఢ నమ్మకాలకి పోయి తమ తమ స్వలాభం కోసం క్షుద్ర పూజలు చేస్తోన్న వైనం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం పంట పొలాల వద్ద డొంక రోడ్ లో గత కొంత కాలం గా జరుగుతోంది.

ప్రస్తుతం ప్రపంచాన్ని టెక్నాలజీ నడిపిస్తుందని చెబుతూనే మరో వైపు వాస్తులు, పూజలకు ప్రాధాన్యమిచ్చే ప్రజలు మన రాజధాని ప్రాంతం లో ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ ఘటన అంతకు మించిపోయింది. కొందరి మాటలు నమ్మిన గ్రామస్తులు తమ తమ ఆరోగ్యం, ఆస్తుల కోసం ఈ విధం గా అర్ధరాత్రి వేళల్లో క్షుద్ర పూజలు చేయిస్తున్నారు.

Black Magic in Andhra Pradesh capital Amaravati.

ఇది ఇంకెక్కడో మారుమూల కుగ్రామం కూడా కాదు.... ఎంతో అభివృద్ధి చెందిన రాజధాని గ్రామం లో చేయిస్తుండం వారి అజ్ఞానాన్ని చెప్పకనే చెబుతోంది. గతంలో వారి వారి బంధువులు, కుటుంబ సభ్యులు ఇలా క్షుద్ర పూజలు చేయడం వల్ల పలు శుభాలు జరగడంతో అమాయక ప్రజలు వేలల్లో డబ్బులు ఇచ్చి మరీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

అర్ధరాత్రి డొంక రోడ్డులో ముగ్గుతో మనిషి ఆకారం లో బొమ్మ గీసి పసుపు, కుంకుమ, నిమ్మ కాయలు, కొబ్బరి కాయలతో మరికొన్ని వస్తువులతో ఈ తతంగాన్ని పెద్ద పెద్ద గా మంత్రాలు సైతం చదువుతూ క్షుద్ర పూజలు జరుపుతున్నారు. అదే సమయం లో ఎవరైనా వెళ్లేందుకు సైతం సాహసం చేయలేక మిన్నకుండి పోతున్నారు.

గత కొంత కాలం గా ఈ తంతు జరుగుతున్నా గ్రామస్తులు ఎవరూ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారు. ఏమి చెబితే తమకు ఏమి నష్టం జరుగుతుందోనని మిన్నకుండి పోతున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు క్షుద్ర పూజలు చేస్తూ అమాయకపు ప్రజలను మోసగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Black Magic in Andhra Pradesh capital Amaravati.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి