పట్ట పగలు విద్యార్థినిపై బ్లేడ్ బ్యాచ్ దాడికి యత్నం: రక్షణ కరువైన విద్యార్ధినులు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: రానురాను మహిళా విద్యార్ధినీలు కు రోడ్డు మీద నడవటం కష్టం గా ఉంటుంది. ఎక్కడో మారు మూల ప్రాంతం లో కాదు, విజయవాడ పట్టణం పటమట లో పట్టపగలే విద్యార్ధిని పై బ్లేడ్ బ్యాచ్ దాడికి ప్రయత్నించారు. పడమట లో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులుబైక్ ఎక్కమని బ్లేడ్లతో బెదిరించారు.

విద్యార్ధిని మీద దాడికి దిగుతుండడంతో గమనించిన మరో మహిళ అడ్డుకునే ప్రయత్నం చేసింది.ఇది గమనించిన కొంతమంది స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. ఆ ఆ సమయం లో పోలీసులు ఫోన్ తీయలేదు. పాతబస్తీలొని నెహ్రూబొమ్మ సెంటర్ వరకు ఆ విద్యార్థినిని వెంటబెట్టుకెళ్లి బ్లేడ్ బ్యాచ్ ని అడ్డుకున్న మహిళ విడిచిపెట్టింది.

Blade batch misbevaves girl sudent at Vijayawada

అయినప్పటికీ బందర్ రోడ్డు వరకు విద్యార్ధినిని ఆకతాయిలు వెంబడించాు. ఏదోలా తప్పించుకున్న విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు తాను చదువుతున్న , నారాయణ కళాశాల ప్రిన్సిపల్ కు చెప్పడంతో పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు సిసి కెమేరాల పుటేజీ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Blade batach at Vjayawada of Andhra Pradesh misbehaved with a girl student.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X