ఆమదాలవలసలో నీలిచిత్రాల కలకలం: స్థానికులతోనే చిత్రీకరణ!
శ్రీకాకుళం: జిల్లాలోని ఆమదాలవలస, పరిసర ప్రాంతాల్లో నీలి చిత్రాల చిత్రీకరణ కలకలం సృష్టిస్తోంది. గత మూడు రోజులుగా ఈ నీలి చిత్రాల చిత్రీకరణ విషయం ఇప్పుడు ఆ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది. ఏ నోట విన్నా అదే మాటపై చర్చ సాగుతోంది.
కాగా, ఆమదాలవలస పట్టణానికి చెందిన కొంతమంది యువకులు ప్రత్యక్షంగా ఈ అశ్లీల చిత్రాలు చిత్రీకరించి విడుదల చేశారని సమాచారం. ఈ నీలి చిత్రాల్లో ఉన్న వ్యక్తులు పట్టణ ప్రజలకు పరిచయస్తులని, అందరికీ తెలిసిన వారని కూడా ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ చిత్రాల్లో పట్టణానికి చెందిన యువకులు, మహిళలు ఉన్నట్టు సమాచారం.

ఇది ఇలా ఉండగా, వీరు తీసిన ఈ నీలి చిత్రాలు చాలామంది యువకుల సెల్‌ఫోన్లలో హల్‌చల్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ విషయంపై పోలీసులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.
కాగా, ఆమదాలవలసలో నీలిచిత్రాలు చిత్రీకరణ అంశంపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ నవీన్‌కుమార్ చెప్పారు. అయితే ఈ విషయంపై పట్టణంలో ప్రజలు చర్చించుకుంటున్నట్లు తెలిసిందని తెలిపారు. అయితే, ఈ విషయంపై దృష్టి సారించి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications