ప్రాణహిత నదిలో పడవ బోల్తా, గల్లంతు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల కోసం గాలింపు..

ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. వారిని ఫారెస్ట్ అధికారులుగా గుర్తించారు. మరో ఇద్దరు సురక్షితంగా ఉన్నట్టు పేర్కొన్నారు. గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొమ్రభీం జిల్లా చింతలమానేపల్లి గూడెం వద్ద గల ప్రాణహిత నదిలో ప్రమాదం జరిగింది.

నదిలో గల్లంతైన వారిని ఫారెస్ట్ బీట్ అధికారులుగా పోలీసులు గుర్తించారు. బాలకృష్ణ, సురేశ్ అనే బీట్ అధికారులు గల్లంతయ్యారని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అహెరి నుంచి గూడెనికి నాటు పడవలో వస్తున్నారు. వీరితోపాటు మరికొందరు కూడా నాటు పడవలో ఉన్నారు. ఇద్దరు ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్టు స్థానికులు తెలిపారు.

boat capsized at pranahita river

బాలకృష్ణ, సురేశ్.. కర్జవెల్లిలో బీట్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం అహెరి నుంచి నాటు పడవలో గూడెనికి వస్తుండగా ప్రమాదం జరిగింది. మరో ఇద్దరు ప్రయాణికులు మాత్రం క్షేమంగా ఉన్నారు. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. బీట్ ఆఫీసర్ల గల్లంతుతో ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+