'అఖిల రాజీనామా చేయాల్సిందే, ఆ బోట్లన్ని దేవినేని, ప్రత్తిపాటిల బినామీలవే'
సంఘటనకు బాధ్యత వహిస్తూ టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విజయవాడ: కృష్ణా నదిలో ప్రమాదానికి గురైన బోటు మంత్రులు, అధికారుల అండదండలతోనే నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల బినామీలే ఆ బోట్లను నడిపిస్తున్నారని సీపీఐ నేత దోనేపూడి శంకర్ ఆరోపించారు.
కృష్ణా నదిలో నడుస్తున్న అక్రమ బోట్లన్నీమంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు బినామీలవేనని ఆయన ఆరోపించారు. బోటు ప్రమాదం నేపథ్యంలో విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన నిర్వహించారు.

ప్రైవేటు బోట్లు అన్నింటినీ రద్దు చేయాలని ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి తప్పు జరగలేదని అఖిలప్రియ చెబుతోన్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications