తిమ్మరాజుపాలెం చేరుకొన్న శశికళ, అనీష్ మృతదేహలు
న్యూజెర్సీలో హత్యకు గురైన శశికళ, ఆమె కుమారుడు అనీష్ సాయి మృతదేహలు ఆదివారం నాడు స్వగ్రామం చేరుకొన్నాయి.ఈ ఘటన జరిగిన రోజు నుండి మృతదేహల కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.
ఒంగోలు: న్యూజెర్సీలో హత్యకు గురైన శశికళ, ఆమె కుమారుడు అనీష్ సాయి మృతదేహలు ఆదివారం నాడు స్వగ్రామం చేరుకొన్నాయి.ఈ ఘటన జరిగిన రోజు నుండి మృతదేహల కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.
గత నెల23వ, తేదిన అమెరికాలోని న్యూజెర్సీలో శశికళ ఆమె కుమారుడు అనీష్ సాయి హత్యకు గురయ్యారు.భర్త హనుమంతరావే ఈ హత్య చేశాడరని శశికళ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

శశికళ భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఈ కారణంగానే ఆమెను వేధించేవాడని శశికళ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శశికళ రాసిన ఈమెయిల్ ను వారు కూడ బయటపెట్టారు.
ఈ హత్యల విషయమై హనుమంతరావును అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.అంత్యక్రియల్లో పాల్గొనేందుకుగాను ఆయన అమెరికా పోలీసులు అనుమతి కూడ ఇచ్చారు.శశికళ ఆమె కొడుకు అనీష్ మృతదేహలు ఆదివారం నాడు ప్రకాశం జిల్లా తిమ్మరాజుపాలెం గ్రామానికి చేరుకొన్నాయి.












Click it and Unblock the Notifications